Illu Illalu Pillalu Today Episode Jan 29: అమూల్య ఇంట్లో లేని విషయం తెలిసి రామరాజు కొడుకుల రచ్చ

Published : Jan 29, 2026, 09:24 AM IST

Illu Illalu Pillalu Today Episode Jan 29: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో అమూల్యను గదిలో బంధిస్తాడు విశ్వక్. రామరాజు ఇంట్లో తెల్లారాక అమూల్య లేని విషయం తెలుస్తుంది. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
గదిలో అమూల్యను బంధించి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్ మొదలవ్వగానే ప్రేమ చాలా అందంగా తయారై వస్తుంది. ధీరజ్ ప్రేమను చూసి మైమరిచిపోతాడు. కాసేపు వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ పాటలు సాగుతాయి. ఆ తర్వాత అక్కడి నుంచి సీన్ విశ్వక్ దగ్గరికి మారుతుంది. అమూల్యను బెదిరిస్తాడు. నిన్ను ప్రేమించినదంతా నాటకమేనని, మీ నాన్న పై పగ తీర్చుకోవడానికి అలా చేశానని చెబుతాడు. రాత్రంతా ఇక్కడే ఉండి ఉదయం ఇంటికి వెళ్తావని, ఈ లోపు అక్కడ పెళ్లి ఆగిపోతుందని, మీ నాన్న పరువు కూడా పోతుందని చెబుతాడు. దీంతో అమూల్య ఏడుస్తూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి విశ్వక్ వెళ్ళిపోతాడు. చేతిలో ఉన్న తాళి కూడా అమూల్య మీదే విసిరేసి గది నుంచి బయటికి వచ్చేస్తాడు.

24
టెన్షన్ పడిన వల్లి

ఇక ఇక్కడి నుంచి సీన్ కామాక్షి దగ్గరికి మారుతుంది. కామాక్షి అమ్మా వాళ్ళు గుడిలో పెళ్లి చీర పూజ చేసి తీసుకొస్తున్నారని, అమూల్యను త్వరగా రెడీ చేయమని నర్మద, ప్రేమలకు చెబుతుంది. కామాక్షి అమూల్య కోసం గదిలో వెతుకుతూ ఉంటుంది. ఈలోపు నర్మద కూడా వచ్చి గదిలో వెతుకుతూ ఉంటారు. అమూల్య కనిపించకపోయేసరికి నర్మదలో అనుమానం మొదలవుతుంది. ఇల్లంతా గాభరాగా అమూల్య కోసం వెతుకుతూ ఉంటారు. కానీ భాగ్యం, వల్లి, ఇడ్లీ బాబాయ్ మాత్రం ఏమీ తెలియనట్టు ఒక మూల నిల్చునిఉంటారు. వల్లి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక తిరుపతి పెళ్లి ఇంట్లో పాటలు పెట్టి ఉత్సాహం పెంచేందుకు ప్రయత్నిస్తాడు. మరోపక్క ప్రేమ సున్నిపిండిని వెతికి ఒక గిన్నెలో వేసి తీసుకొస్తుంది. ఈ లోపు నర్మద అటుగా వచ్చి అమూల్య కనిపించట్లేదు అన్న విషయాన్ని చెబుతుంది. దీంతో ప్రేమ కూడా చాలా టెన్షన్ పడుతుంది.

34
అమూల్య కోసం అన్నదమ్ములు

నర్మద, ప్రేమ ఇంట్లో ఇటు అటు హడావిడిగా వెతుకుతూ ఉండడం చూసి వల్లి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఈ లోపు అన్నదమ్ముల ముగ్గురు ఇంటికి వస్తారు. తిరుపతి, ఇడ్లీ బాబాయ్ అందరూ డాన్సులు వేయడం చూసి ఆనందపడతారు. ఈలోపు నర్మద కంగారుగా అక్కడికి వస్తుంది. ప్రేమ కూడా అక్కడికి వచ్చి కంగారు పడిపోతూ ఉంటుంది. ఈలోపు కామాక్షి కూడా అక్కడికి వచ్చి అమూల్య కనిపించిందా అని అడుగుతుంది. అప్పుడు అన్నదమ్ములకు విషయం అర్థం అవుతుంది. ఇల్లంతా వెతికినా కూడా అమూల్య కనిపించలేదని చెబుతారు. దాంతో సాగర్, చందు, ధీరజ్ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇదంతా చూసి వల్లి కూడా గాభరా పడుతుంది. కానీ భాగ్యం, వల్లి కూడ అక్కడికి వస్తారు. అక్కడ వల్లి ఓవరాక్షన్ చేస్తుంది. అమూల్యను నేనే రెడీ చేస్తానని అంటుంది. అమూల్య కనిపించట్లేదని చెప్పేసరికి భాగ్యం పెద్ద నోరుతో అయ్యో అయ్యో అమూల్య కనిపించట్లేదా అని అరుస్తుంది. అందరూ కలిపి ఆమెను ఆపుతారు.

44
సేనాపతి ఇంట్లో రచ్చ

తిరుపతికి కూడా విషయం తెలుస్తుంది. అందరూ కంగారు పడతారు. ధీరజ్...విశ్వక్ ఏదో చేసి ఉంటాడని అనుమానిస్తాడు. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని అమూల్య ఇంట్లో లేదంటే విశ్వ ఏదో చేసి ఉంటాడు. వాడు అంతు చూద్దాం పదండి అంటూ ముగ్గురు అన్నదమ్ములు ఎదురింటిలోకి దూసుకెళ్తారు. సేనాపతి ఇంట్లోకి వెళ్లి ముగ్గురు అన్నదమ్ములు రచ్చ రచ్చ చేస్తారు. భద్రావతి కిందకి వచ్చి మీ చెల్లి పెళ్లి సమయంలో ఇంట్లో కనిపించట్లేదంటే.. ఎవరితోనో లేచిపోయిందనే కదా అర్థం అని అంటుంది. చెల్లిని వెతకడం చేతకాక మా వాడి మీద పడి ఏడుస్తారు ఏంట్రా అని అంటుంది. ఈలోపు సేనాపతి వచ్చి ముగ్గురు అన్నదమ్ములను దూరంగా తోసేస్తాడు. మీరే ఏదో చేశారు మా చెల్లి ఎక్కడ అని సేనాపతిని, భద్రావతిని నిలదీస్తారు. ‘అయినా పెళ్లికూతురు లేచిపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. బస్టాండ్ లోనూ, రైల్వేస్టేషన్లోనూ, గుడిసెల్లోనే, పాకల్లోనూ వెతకాలి. అంతేకానీ గౌరవనీయమైన మా ఇంటికి వచ్చి ఏంటి మీ పిల్ల చేష్టలు’ అని అడుగుతుంది భద్రావతి. ఇక సేనాపతి వెకిలిగా నవ్వుతూ వాళ్లని మరింతగా రెచ్చగొడతారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories