
ప్రభావతి కాళ్ల నొప్పితో బాధపడుతూ ఉంటుంది. రోహిణీ వచ్చి రెస్ట్ తీసుకోమని చెబుతూ ఉంటుంది. ‘ ఇంట్లో ఆ మీనా భజన ఎక్కువైపోయింది.. నా ఇంట్లో నాకే విలువ లేకుండా పోతోంది’ అని ప్రభావతి అంటుంది. ‘ మీరు ముందు కోలుకొని... మామూలుగా నడవండి..అప్పుడు అన్నీ మీరు కోరుకున్నట్లే జరుగుతాయి’ అని చెప్పి.. రోహిణీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.‘ ఇప్పుడు నేను మీనా, శ్రుతికి బుద్ధి చెప్పకపోతే.. రోహిణీకి కూడా అలుసు అయిపోతాను.. అలా జరగడానికి వీళ్లేదు’ అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనా కాపడం పెట్టడానికి వేడి నీళ్లు తీసుకొని వస్తుంది. కానీ మీనా మంచి మనసు అర్థం చేసుకోకుండా.. ప్రభావతి నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. కాపుడం పెట్టడానికి వచ్చాను అని.. మీనా అంటే.. ‘ నాకు పిండం పెట్టిపోవే.. ఆ వంకతో వేడి వేడి నీళ్లు నా కళ్ల మీద పోసి ఆనందపడాలని చూస్తున్నావా’ అని అడగుతుంది. అయితే..ఆ మాటకు మీనా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావ్ అని ప్రభావతి అడిగితే.. ‘ నేను కాపడం పెట్టడానికి వస్తే.. మీరు నన్ను ఎలా తిడతారో మీ అబ్బాయి నాకు ముందే చెప్పారు.. మీరు సేమ్ అలానే తిడుతున్నారు. తిడితే తిట్టారు.. నేను నూనె తుడవడం ఆలస్యం చేయడం వల్లే..మీరు కింద పడ్డారు కాబట్టి.. తప్పు నాదే అనిపిస్తుంది.. ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను. మీరు, మామయ్య బాగుంటేనే ఈ ఇల్లు కూడా బాగుంటుంది.. లేదంటే మాలో మేము తగువులు ఆడుకొని ఈ ఇల్లు ముక్కలు అవుతుంది. మీరు బాగుండాలి.. నన్ను ఎంత కోప్పడినా.. మీరు బాగుండాలి అనే కోరుకుంటాను.. కాపడం పెడతాను’ అని మీనా అంటుంది. ప్రభావతి మాత్రం కాపడం పెట్టించుకోనని.. అక్కడి నుంచి వెళ్లిపోమ్మని విసుక్కుంటుంది. దీంతో.. మీరు పెట్టుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మీనా వెళ్లిపోగానే.. ప్రభావతి కాపడం పెట్టుకుంటుంది. అదంతా మీనా చాటుగా చూసి నవ్వుకుంటుంది. అయితే.. వేడి నీళ్లు చల్లారిపోయాయని.. వేడి చేసుకోవడానికి కుంటుకుంటూ ప్రభావతి కిచెన్ లోకి వెళ్తుంది.
ఈలోగా.. మీనా.. కిచెన్ లో పైన.. ఏవో మసాలా దినుసుల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ లోగా మీనా కాలుజారి పడిపోతుంటే.. బాలు వచ్చి పట్టుకుంటాడు. పైన డబ్బాలో ఉన్న పిండి, కుంకుమ మొత్తం వచ్చి ప్రభావతి తలమీద పడతాయి. ఆమెను చూసి మీనా దయ్యం అంటూ అరుస్తుంది. అప్పుడే వచ్చిన మనోజ్ కూడా.. దయ్యం అని అరుస్తుంది. దీంతో.. కోపం వచ్చిన ప్రభావతి..దోశ పెనం పట్టుకొని మనోజ్ మీద సీరియస్ అవుతుంది. ఇంట్లో అందరూ ప్రభావతి ని చూసి దయ్యం అనుకుంటారు. మీనా, బాలు మాత్రం నవ్వుకుంటారు. నా ఇంట్లో నుంచి నన్నే తరిమేస్తారా అని ప్రభావతి అంటే.. దానికి కూడా మనోజ్ కామెడీగా మాట్లాడతాడు. దీంతో.. తట్టుకోలేక తానే ప్రభావతిని అని చెబుతుంది. ‘ ఈ రాక్షసి..బియ్యం పిండి, కుంకుమ పడేలా చేసింది’ అని ప్రభావతి చెబుతుంది. ‘ ఆంటీ దయ్యం అయితే ఇలానే ఉంటారా?’ అని శ్రుతి అనడం కొసమెరుపు. మీనా కావాలని ఇలా చేసింది అని ప్రభావతి రెచ్చిపోయి మీనాని తిడుతుంది. శ్రుతి మాత్రం.. వెరైటీగా ఉన్నారు అని సెల్ఫీ తీసుకుంటుంది. ప్రభావతి అరవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ప్రభావతి స్నానం చేసి బయటకు వస్తుంది.. అప్పుడు రోహిణీ వచ్చి.. మళ్లీ స్నానం చేశారా అత్తయ్య అని అడుగుతుంది. ‘ మరి చేయకుండా అలానే ఉండిపోవాలా? మనోజ్ గాడు దిష్టి బొమ్మలా ఉన్నావ్ అన్నాడు’ అని ప్రభావతి చెబుతుంది. ‘ నిజంగానే మీనా, శ్రుతి చాలా ఎక్కువ చేస్తున్నారు..మీనా అండ చూసుకొని శ్రుతి ఏం చేసిందో తెలుసా?’ అని రోహిణీ అడుగుతుంది. ఏమైంది అని ప్రభావతి అంటే... పిండి పడిన ప్రభావతి ఫోటోని శ్రుతి స్టేటస్ పెట్టిన విషయం చూపిస్తుంది. ‘ దిష్టి బొమ్మ గెటప్ లో మా ఆంటీ అని పెట్టింది.. వాళ్ల అమ్మ వాళ్లు ఆ ఫోటో చూసి ఎంత నవ్వుకుంటారు.. మీ మీద గౌరవం ఉంటుందా?’ అని రోహిణీ అడుగుతుంది. ‘ అయిపోయింది.. నా ఓపిక నశించింది. పెద్దింటి అమ్మాయి కదా అని చూసీ, చూడనట్లు వదిలేస్తే.. మాటలు, చేతలు ఎక్కువయ్యాయి’ అని ప్రభావతి అంటుంది. ‘ శ్రుతి మొదట్లో ఇలా ఉండేది కాదు.. మీనాతో చేరి ఇలా తయారైంది’ అని రోహిణీ అంటుంది. ‘ ఈ ప్రభావతి గురించి వీళ్లకు తెలీదు..దీనికి ముగింపు నేను చెబుతాను.. రెడీ అయ్యి వస్తాను.. నువ్వు కూడా నాతో రా’ అని రోహిణీతో ప్రభావతి చెబుతుంది.ఎక్కడికి అత్తయ్య అని రోహిణీ అడుగుతుంది.
సీన్ కట్ చేస్తే... డ్యాన్స్ క్లాస్ దగ్గరకు రోహిణీ, ప్రభావతి వస్తారు. అక్కడికి వెళ్లగానే.. పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేస్తున్న పిల్లలకు మళ్లీ మంచి స్టెప్పులు వేయిస్తుంది. ‘ ఎందుకు అంత కోపంగా ఉన్నావ్?’ అని ప్రభావతిని వాళ్ల ఫ్రెండ్ అడుగుతుంది. ‘ అత్తయ్యకు కోపం రావడానికి ఇంట్లో ఒకరు కారణం’ అని రోహిణీ అంటే.. ‘ ఇంకెవరు..అమాయకురాలు మీనా నే కదా’ అని ఆవిడ అంటుంది. ‘ అది అమాయకురాలు కాదు.. మాయకురాలు. ఇప్పుడు అది నాయకురాలు అయ్యి.. శ్రుతికి ట్రైనింగ్ ఇచ్చి.. నామీదేకే ఉసి గొలుపుతోంది’ అని ప్రభావతి చెబుతుంది.‘ అత్తగారికి మర్యాద ఇవ్వాలని కూడా తెలీదు.. మరదలిని ఏడిపించినట్లు నన్ను ఏడిపిస్తున్నారు. మీనాతో కలిసి శ్రుతి నన్ను ఎగతాళి చేస్తోంది.. ఒక్క రోహిణీ మాత్రమే నాకు విలువ ఇస్తోంది. ఆ ఇద్దరు కోడళ్లకు బుద్ధి చెప్పాలి’ అని ప్రభావతి చెబుతుంది. ‘ అది నీ వల్ల కాదు వదిన’ అని వాళ్ల ఫ్రెండ్ అంటే.. ‘ఎందుకు కాదు?’ అని ప్రభావతి అడుగుతుంది. ‘ మీనా మీద ఈగ వాలినా బాలు ఒప్పుకోడు. శ్రుతి మీద ఈగ వాలితే.. శ్రుతి ఊరుకోదు’ అని ఆమె అంటుంది. ‘ నా చేతులకు మట్టి అట్టగుండా ఏం చేస్తానో చూడు.. ఎటు నుంచి నరుక్కురావాలో నాకు బాగా తెలుసు’ అని ప్రభావతి అంటుంది.
మరుక్షణంలో.. అక్కడికి శ్రుతి వాళ్ల అమ్మ వస్తుంది. ఆమెతో మాట్లాడటానికి డ్యాన్స్ వేసే పిల్లలను రెస్ట్ తీసుకోమని చెబుతుంది. అందులో ఉన్న ప్రేమ జంట మాత్రం.. అందరికంటే దూరంగా వేరే గదిలోకి దూరతారు. నలుగురు ఆడవాళ్లు కనీసం గంట అయినా మాట్లాడుకుంటారని.. మనకు ప్రైవసీ దొరికిందని వాళ్లు సంబరపడతారు. మరో వైపు.. ఏం మాట్లాడాలని పిలిచారు అని శ్రుతి వాళ్ల అమ్మ అడుగుతుంది.
‘ ఏదో మాట్లాడాలన్నారు.. మౌనంగానే ఉండిపోయారు.. అప్పు ఏమైనా కావాలా?’ అని శ్రుతి వాళ్ల అమ్మ అడుగుతుంది. ‘ చెప్పు తీసుకొని కొడతారు మా ఆయన.. మీ దగ్గర అప్పు తీసుకుంటే’ అని ప్రభావతి అంటుంది. ‘ మరి.. విషయం ఏంటో చెప్పండి’ అని శ్రుతి వాళ్ల అమ్మ అడిగితే.. ‘ మీ అమ్మాయి ప్రవర్తన నాకు నచ్చడం లేదు.. మీరు ఏమైనా అనుకోండి.. నేను ఉన్నది ఉన్నట్లే నిజాయితీతో మాట్లాడతాను’ అని ప్రభావతి అంటుంది. ‘ మా శ్రుతి ప్రవర్తన బాలేదా? అది ఎప్పుడో మిడిల్ క్లాస్ అమ్మాయిలా మారిపోయింది కదా? రిచ్ గా పెరిగినట్లు మీ ఇంట్లో చూపించలేదే’ అని ఆవిడ అంటుంది. ‘ మీరు శ్రుతి పెట్టిన వాట్సాప్ స్టేటస్ చూడండి’ అని రోహిణీ చెబుతుంది.
అది చూసి శ్రుతి వాళ్ల అమ్మ బాగా నవ్వుకుంటుంది. కామాక్షి కూడా పగలబడి నవ్వుతుంది. ‘ అత్తయ్య అంటే కొంచెం కూడా మర్యాద లేకుండా పోయింది. పొరపాటున నెత్తి మీద పిండి పడితే.. దానిని ఫోటో తీసి ఇలా పెట్టింది’ అని ప్రభావతి చెబుతుంది. ‘ మీరు ఇద్దరూ ఫ్రెండ్స్ లా ఉంటారు కదా.. అందుకే సరదాగా అలా చేసింది’అని శ్రుతి వాళ్ల అమ్మ కూతురికి సపోర్ట్ గా మాట్లాడుతుంది. ‘ అత్తగారి పరువు తీయడం.. సరదాగా ఆటపట్టించడం ఒకటేనా? మీరే చెప్పండి.. ఇదొక్కటే కాదు అల్లరి పనులు చేస్తోంది.. అల్లరి చేస్తుంది. ఇంట్లో దయ్యం ఉందని చెప్పి భయ పెట్టింది. చూడండి వదినగారు నాకు ఒక ఆడపిల్ల ఉంది.. ఇంకో ఆడపిల్ల మీద నాకు ఏమైనా కక్షా? ఈ మధ్య శ్రుతి బాగా పాడైపోయింది అంతా సహవాస దోషం. మా ఇంట్లో పూలు అమ్ముకునేది ఒకటి ఉంది కదా.. దానితో కలిసి పాడైపోయింది... దాని బుద్ధి తగిలించుకొని.. అత్త అంటే మర్యాద లేకుండా పోయింది.. ఇద్దరూ కలిసి ఇంటిని సర్కస్ చేశారు.. అత్తగారి ఇంట్లో ఎలా ఉండాలో నేర్పలేదా’ అని ప్రభావతి సీరియస్ గా అడుగుతుంది.‘ మేం నేర్పి పంపే అవకాశం ఎక్కడిచ్చారు? మీ అబ్బాయే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు? మీరు ఇంట్లో ఉంచుకున్నారు.. అలా ప్రవర్తిస్తే.. ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? రవి, శ్రుతి ని బయటకు పంపించండి’ అని శ్రుతి వాళ్ల అమ్మ అంటుంది.
ఆ మాటకు రోహిణీ, కామాక్షి షాక్ అవుతారు. ‘ అంతా విని మీరు ఇచ్చే సలహా ఇదా? మా ఇంట్లో ఎవరు ఎన్ని అనుకున్నా.. ఎవరినీ బయటకు పంపడానికి మా ఆయన అస్సలు ఒప్పుకోరు. కొట్టుకు చచ్చినా.. చచ్చినట్లు ఇల్లు పట్టుకొని ఉండాల్సిందే’ అని ప్రభావతి చెబుతుంది ‘ శ్రుతి మా ఒక్కగానొక్క కూతురు.. గారాబంగా పెరగడం వల్ల అలా తయారైంది.. కొంచెం మీరే సర్దుకుపోవాలి’ అని శ్రుతి తల్లి అంటుంది. ‘ కొంచెమా.. రోజూ మీనాతో కలిసి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటుంది.. ఎంతకని సర్దుకుపోవాలి?’ అని ప్రభావతి అంటుంది. రోహిణీ కూడా వంతపాడుతుంది. నా కొడుకుని పనివాడిని పిలిచినట్లు పిలుస్తుంది.. పనులు చేయించుకుంటుంది.. అని ప్రభావతి చెబుతుంది.‘ నా కూతురు నా మాటే వినేదే అయితే.. మీ కొడుకును ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? భరించలేకపోతే వాళ్ళిద్దరినీ మా ఇంటికి పంపించండి’ అని చెప్పి.. శ్రుతి వాళ్ల అమ్మ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్లాన్ రివర్స్ అయినందుకు.. ప్రభావతి ఫీల్ అవుతుంది.
‘ నేను అనుకున్నదే జరిగింది.. శ్రుతిని భరించలేక వాళ్లే ఇంట్లో నుంచి గెంటేస్తారు. అల్లుడు కూడా వెనకే వస్తాడు. ఈ లోగా ఈ గొడవను ఇంకాస్త పెద్ది చేయాలి’ అని శ్రుతి వాళ్ల అమ్మ ఇంకో స్కెచ్ వేస్తుంది. కమింగప్ లో.. శ్రుతి వాళ్ల అమ్మ వెళ్లి మీనాను తిడుతుంది. మీనా, బాలు వెళ్లి.. రవి, శ్రుతితో పంచాయతీ పెడతారు.