ఈ కార్యక్రమంలో అనేక ఆసక్తికర విషయాలను నాని వెల్లడించారు. ముఖ్యంగా ఒక పాత టీ షర్ట్ గురించి జరిగిన సంభాషణ ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. షోలో జగపతి బాబు, నాని కి చెందిన ఓ పాత టీ షర్ట్‌ను చూపించారు. అది చూసిన నాని ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ టీ షర్ట్ వెనక ఉన్న కథను షేర్ చేశారు. నాని మాట్లాడుతూ, "ఇది నా ఫస్ట్ ఫోటోషూట్ షర్ట్. 'అష్టాచెమ్మా' సినిమా ఆడిషన్ కోసం ఫొటోలు కావాలంటే, జూబ్లీహిల్స్‌లోని ఓ పార్కులో ఈ టీ షర్ట్ వేసుకొని తక్షణమే ఫొటోలు తీసి పంపించాను. అది నా సినీ ప్రయాణంలో తొలి అడుగు." అని నాని గుర్తుచేసుకున్నారు.