Janhvi Kapoor: బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ 1989లో ఓ వచ్చిన ఓ కల్ట్ మూవీలో నటించబోతుందట. అది కూడా శ్రీదేవి సూపర్‌హిట్ మూవీలో తన తల్లి పోషించిన పాత్రలో నటించబోతుందట. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఈ మూవీ అయినా జాను పాపకు హిట్ తెచ్చిపెట్టేనా?
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం. తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తోంది. అయితే.. గత కొంతకాలంగా సరైన హిట్టు లేక ఎదురుచూస్తోంది. తల్లి స్టార్ హీరోయిన్, తండ్రి మెగా ప్రొడ్యూసర్ అయినా ఈ అమ్మడుకు మాత్రం సక్సెస్ రావడం లేదు.
గ్లామర్ రోల్స్ కు మాత్రమే కాదు.. నటనకు స్కోప్ ఉన్న సినిమాలని ఎంచుకుంటున్నా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోలేకపోతోంది. బాలీవుడ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈ నేపథ్యంలో జాన్వీ పాప తన తల్లి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్ లో నటించబోతుందట. అది కూడా తన తల్లి పోషించిన పాత్రలో.
25
ఎనిమిదేళ్లుగా నిరీక్షణ
జాన్వీ కపూర్ 2018లో ‘ధడక్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీ హిట్టు కొట్టిన గత ఎనిమిదేళ్లుగా సరైన హిట్ అందుకోలేకపోతుంది. మరో సక్సెస్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తోంది. తెలుగులో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘దేవర’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నా.. నటన పరంగా జాన్వీ కపూర్ కు సరైన గుర్తింపు రాలేదు.
ఆమె పాత్రకు కథాప్రాధాన్యం లేకున్నా కేవలం సాంగ్స్ ల్లో గ్లామర్ షో చేయడం కోసమే డిజైన్ చేసినట్టు ఉందని మూవీ లవర్స్ నిరాశ చెందారు. ఇలా ‘దేవర’మూవీ హిట్ అయినా.. జాను పాప మాత్రం సంతృప్తి లేకుండా పోయింది.
35
జాన్వీ కపూర్ ‘పరం సుందరి’: ట్రైలర్ హైప్, బాక్సాఫీస్ బోల్తా
తాజాగా స్టార్ డైరెక్టర్ తుషార్ జలోటా దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో జాన్వీ కపూర్ నటించిన ‘పరం సుందరి’ సినిమాకు ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో జాన్వీకి హిట్ పడిందని అందరూ భావించారు. కానీ, కథలో కొత్తదనం లేకపోవడం, కామెడీ పార్ట్ ఆడియన్స్ కు కనెక్ట్ కాకపోవడం, ఊహించినట్లుగానే ఉంటే ట్విస్టులు ఈ మూవీకి మైనస్‌గా నిలిచాయి.
దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బోల్తా పడింది. ఈ మూవీలో మలయాళ అమ్మాయిగా జాన్వీ బాగానే నటించినా, కథలో కొత్తదనం లేకపోవడం కారణంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో జాన్వీ కెరీర్ కోసం తను ఏ సినిమా ఎంచుకోవాలో సందేహం పెరిగింది.
తాజాగా ఓ కల్ట్ మూవీ రీమేక్ విషయం సోషల్ మీడియా వేదిక వైరల్‌గా మారింది. నాలుగు దశాబ్దాల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన ‘చాల్‌బాజ్’ (1989) చిత్రం శ్రీదేవి ప్రధాన పాత్రలో తెరకెక్కింది. ఈ చిత్రానికి పంకజ్ పరాశర్ దర్శకత్వం వహించగా, రజనీకాంత్, సన్నీ డియోల్ హీరోలుగా నటించారు.
సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో, ప్రేక్షకుల ప్రియతనం మాత్రమే కాక, శ్రీదేవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తన బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచింది. ఇప్పడు ఈ సినిమా రీమేక్ చేస్తున్నారని వార్తలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.
55
శ్రీదేవి పాత్రలో జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి ఫేవరెట్ మూవీల్లో ‘చాల్‌బాజ్’ ఒకటి. ఈ మూవీ రీమేక్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అది కూడా తన తల్లి శ్రీదేవి పోషించిన పాత్రలో నటించబోతుండటం మరో ఇంట్రెస్టింగ్ ఆంశం. ఈ రీమేక్ లో జాన్వీ ద్విపాత్రాభినయం చేయాల్సి ఉంటుంది.
అయితే.. ఈ ప్రాజెక్ట్ దర్శకుడు ఎవరు? రీమేక్ కథలో ఎలాంటి మార్పులు ఉంటాయి? అనే అంశాలపై సెప్టెంబర్ చివరి వరకు అధికారిక ప్రకటన చేబోతున్నట్టు బాలీవుడ్ టాక్. జాన్వీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రీమేక్, బాలీవుడ్‌లో మరోసారి వార్తల్లో నిలిచే అవకాశం ఉందని, ఈ మూవీతోనై జాన్వీకి బ్లాక్ బస్టర్ హిట్ పడుతుందో? లేదో? అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.