నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. నాని ఎంపిక చేసుకుంటున్న చిత్రాలు అద్భుతం అనే చెప్పాలి. ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధారణ స్థాయిలో మాత్రమే వసూళ్లు సాధించినా, ప్రతి చిత్రానికీ స్ట్రాంగ్ ఓపెనింగ్స్ రావడం విశేషం. అలాగే, నాని సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ రెండు వైపులా ఆదాయం పొందుతున్నారు.