
ఎపిసోడ్ ప్రారంభంలో ముళ్ళ దారిలో వెళ్తున్నప్పుడు ముందు గుచ్చుకోకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే అంటాడు మాధవి భర్త. ఇది తప్పొప్పులు గురించి మాట్లాడుకునే సమయం కాదు బెయిల్ తీసుకొచ్చారా అని అడుగుతుంది తులసి. తీసుకురావడానికి అదేమీ పకోడీ పొట్లం కాదు అంటూ వాళ్ల దగ్గరికి వస్తుంది లాస్య. నీకేం కావాలి.. ఎందుకు మా అందరినీ ఇలా టార్చర్ పెడుతున్నావ్ అంటుంది దివ్య. అవన్నీ మీ నాన్నకు తెలుసు అంటుంది లాస్య. నువ్వు అనేదానివే లేకపోతే మేము ఎంత ప్రశాంతంగా ఉండే వాళ్ళమో అంటుంది దివ్య.
విడాకులు ఇచ్చిన తర్వాత కూడా మీ నాన్న వెనుక మీ అమ్మ పడకపోతే మేము కూడా అంతే ప్రశాంతంగా ఉండే వాళ్ళం అంటుంది లాస్య. నువ్వు చాలా తెలివైన దానివి ఏమి పట్టించుకోనట్లు ఉంటూనే కూతుర్ని రెచ్చగొడుతున్నావు అని తులసిని అంటుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ కోప్పడతాడు నందు. వదిలేసాను అంటే పెంచుకున్న కుక్కే ఒప్పుకోదు అలాంటిది లాస్య ఎందుకు ఒప్పుకుంటుంది. ఈ రాత్రంతా బాగా ఆలోచించుకో కలిసి కాపురం చేద్దాం అంటే కేసు వెనక్కి తీసుకుంటాను అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లాస్య.
మరోవైపు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిన పిల్ల ఇంటికి తిరిగి రాలేదంటే ఏమనుకోవాలి అంటాడు బసవయ్య. తొందరపడి తనని అపార్థం కు ఏదో పని లేకపోతే తను అలా చేయదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన దగ్గరనుంచి తను బాధ్యతగానే ప్రవర్తించింది అంటాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. మీకేం పోయింది మీరు అలాగే అంటారు రేపు దివ్య పుట్టినరోజు అక్కని అడుగుతారు. అక్క మంచిది కాబట్టి అన్నీ సర్దుకుంటుంది అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు బసవయ్య. మరిదికి పద్ధతులు నేర్పుతుంది మరి తను పద్ధతిగా ఉండదా అని చెప్పి వెళ్లాలని తెలియదా అంటుంది ఆమె భార్య.
విక్రమ్ దివ్య కి ఫోన్ చేస్తాడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చాలా టెన్షన్ గా ఉన్నాను తర్వాత మాట్లాడతాను అంటూ మరో మాటకి అవకాశం లేకుండా ఫోన్ పెట్టేస్తుంది దివ్య. వదిన కనీసం అన్నయ్య కైనా గౌరవం ఇవ్వాలి కదా..ఇప్పుడు అన్నయ్యకి మన అందరి ముందు పరువు పోయినట్లే కదా అంటాడు సంజయ్. మరోవైపు బెయిల్ తీకురావడానికి ఎందుకు లేట్ అవుతుంది కేసు చిన్నదే కదా అంటాడు పరంధామయ్య. గృహహింస చిన్నది కాదు ఇలాంటి కేసులు ఆడవాళ్ళకి అనుకూలంగా ఉంటాయి అంటాడు మాధవి భర్త. శని దేవతను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు.
వాడు బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటూ బాధపడుతుంది అనసూయ. ఇప్పుడు ఏం చేయటం అంటూ అల్లుడిని సలహా అడుగుతుంది. నిప్పు పెట్టిన వాళ్లే నిప్పు ఆపాలి. కేసు కోర్టు వరకు వెళ్లకూడదు అంటే లాస్య తలుచుకుంటే అయిపోతుంది అంటాడు మాధవి భర్త. దానికి అంత మంచి బుద్ధి ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు అంటూ శాపనార్ధాలు పెడుతుంది అనసూయ.
ఈ రాత్రికి టైం ఇవ్వండి రేపు ఎలాగైనా బెయిల్ తీసుకువస్తాను అంటాడు మాధవి భర్త. ఆ రాత్రి ఎవరికీ నిద్ర పట్టదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉంటారు. మరోవైపు హాల్లోనే నిద్రపోయిన విక్రమ్ దగ్గరికి వచ్చి కోట్ల ఆస్తి ఉండి నీకు ఇదే ఖర్మరా అంటూ మనవడిని లేపుతాడు విక్రమ్ వాళ్ళ తాతయ్య. లెగుస్తూనే దివ్య వచ్చిందా అని అడుగుతాడు విక్రమ్.
ఇంతసేపైనా తను నీకు ఫోన్ చేయలేదు అంటే ఏదో పెద్ద సమస్య వచ్చి ఉంటుంది ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్లి రావచ్చు కదా అంటాడు తాతయ్య. దివ్య అంటే నాకు అభిమానమే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు అంటుంది రాజ్యలక్ష్మి. వెళ్తే మీ మనవడికి బానే ఉంటుంది కానీ ఇక్కడ మా అక్క పరువు పోతుంది అంటాడు బసవయ్య.
మీరు కాపురాన్ని విడగొట్టేలాగా మాట్లాడుతున్నారు అంటాడు తాతయ్య. పోనీలే తమ్ముడు వెళ్ళని నా పరువు కన్నా వాళ్ళ కాపురమే ముఖ్యం నేను తల ఒంచుకొని బ్రతికేస్తాను అంటూ అమాయకురాలి లాగా లోనికి వెళ్ళిపోతుంది రాజలక్ష్మి. మరోవైపు లాస్య తులసికి ఫోన్ చేసి నా భర్తతో నీకేం పని అంటుంది. కష్టాల్లో ఎవరున్నా నేను సాయం చేస్తాను అంటుంది తులసి. నేను కూడా కష్టాల్లో ఉన్నాను నాకు సాయం చెయ్యి అంటుంది లాస్య.
కాలు జారి పడితే లేపవచ్చు కానీ కావాలని బురదలో కాళ్లు పెట్టిన వాళ్ళ కోసం జాలి పడవలసిన అవసరం లేదు అంటుంది తులసి. తరువాయి భాగంలో ఇంటికి వచ్చిన దివ్యని మా అమ్మ పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు బాగోలేదు అంటూ గుమ్మంలోనే నిలదీస్తాడు విక్రమ్. మరోవైపు బెయిల్ మీద బయటకు వచ్చిన నందు లాస్యకి విడాకులు ఇవ్వడానికి సిద్ధపడతాడు