ఈరోజు ఎపిసోడ్లో లాస్య దొంగ ఏడుపులు ఏడుస్తూ అందరిని బయటికి పంపాలను నేను ఇంట్లో రాజ్యం ఏలాలని ఇలాంటి పని చేయలేదు మావయ్య అని అంటుంది. ఇంట్లో అందరూ కలిసి ఉండాలని సంతోషంగా ఉండాలని నా ఆశ ఆశయం మావయ్య అనడంతో ఇంట్లో అందరూ లాస్య మాటలకు ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు. నేను ఇంటిని నా పేరు మీదికి రాయించుకున్న విధానం మాట్లాడిన తప్పు అయ్యి ఉండవచ్చు, నా మనసులో మాత్రం తప్పుడు ఆలోచనలు లేవు మామయ్య నన్ను నమ్మండి ప్లీజ్ అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తుంది లాస్య. అప్పుడు ప్రేమ్ అందితే జుట్టు అందకపోతే కాళ్లు అని అంటాడు.