తాజాగా క్యాష్ షోకి సీనియర్ కమెడియన్లు పృథ్వీ రాజ్, కృష్ణ భగవాన్, నటి జ్యోతి, కరాటే కళ్యాణి అతిథులుగా హాజరయ్యారు. వీరంతా కలసి ఒక రేంజ్ లో హంగామా చేసినట్లు ఉన్నారు. తాజాగా క్యాష్ ప్రోమో విడుదలై ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే కృష్ణ భగవాన్ తన సెటైర్స్ తో బాగా నవ్వించాడు. ఆ సెటైర్లకు బలైంది మాత్రం కమెడియన్ పృథ్వీనే.