అప్పుడు వసుధారకి రిషి మెసేజ్ చేయడంతో మీ ఇష్టం సార్ మీకు నచ్చింది తీసుకోండి అని మెసేజ్ చేస్తుంది. అప్పుడు రిషి ఇదేంటి మళ్ళీ సెలెక్షన్ నాకే వదిలేసింది అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు గౌతమ్ కాలేజీ స్టాప్ స్టూడెంట్స్ అందరికీ ఫోన్ చేసి మన భోజనానికి రమ్మని చెబుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వచ్చి ధరణి పై సిరీయస్ అయ్యి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. మహేంద్ర అందరికీ ఫోన్ చేసి చెప్పావా రిషి,వసు లని నువ్వే చూసుకోవాలి అని జాగ్రత్తలు చెబుతాడు. అప్పుడు గౌతమ్ దేవయానికి పెద్దమ్మ వనభోజనాలకు రాకుండా చేస్తే మంచిది అనుకోని ప్లాన్ వేస్తాడు.