ఈరోజు ఎపిసోడ్ లాస్య అయినా ఈ చెత్త అంత ఎవరు క్లీన్ చేస్తారు అనగా అప్పుడు రాములమ్మ ఒక చెయ్యి వేస్తే అయిపోతుంది కదమ్మా అనడంతో నీ ముఖం చూస్తే కేఫ్ కూడా ఎవరూ రారు అంటుంది లాస్య. అరగంటలో అంతా అయిపోతుందమ్మా అనడంతో నీ ముఖానికి మేకప్ వేస్తే ఐశ్వర్యరావు అవుతావా అనగా అప్పుడు ప్రేమ్ లాస్య మీద సెటైర్ వేస్తూ సాయంత్రం వరకు టైం ఇస్తే ఐశ్వర్యరాయ్ లా కాకపోయినా కనీసం లాస్యలా అయిన తయారు చేయవచ్చు అనడంతో నందు తో పాటు అక్కడున్న వారందరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య నేను చెప్పేది ఏంటి అంటే నందు అనగా నువ్వు చెప్పేది కాదు నేను చెప్పేది విను మన దగ్గర టైం డబ్బు రెండూ లేవు. అప్పుడు శుభమా మొదలుపెడుతుండగా లాస్య తులసి మీద అరుస్తూ ఉంటుంది.