అప్పుడు వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటూ ఉండగా రిషి ఎలా అయినా వసుధార మెడలో ఎవరు తాళి కట్టారో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు మనసులో ఆలోచించుకుంటూ ఉంటారు. ఇంతలోనే జగతి,మహేంద్ర కాలేజీకి వస్తారు. అప్పుడు రిషి వసు లను చూసి చూసావా జగతి అసలు వీళ్ళు ఏంటో ఎవరికి అర్థం కాదు అని అంటాడు మహేంద్ర. అప్పుడు వసుధార, మహేంద్ర వాళ్ళని చూసి అక్కడికి వెళ్లి ప్రేమగా పలకరించడంతో మహేంద్ర వాళ్ళు కూడా నవ్వుతూ పలకరించగా అది చూసి రిషి ఆశ్చర్యపోతాడు. అప్పుడు వసుధార అక్కడి నుంచి వెళ్లిపోవడంతో రిషి ఇక్కడ అక్కడికి వచ్చి ఏంటి మేడం వసుధార జరిగిన విషయం గురించి ఏమైనా మాట్లాడిందా అని అడగగా ఏం లేదు రిషి.