ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... నందు, నీకు ఏమైనా అందం లేదా? లేకపోతే మంచితనం లేదా? ఆస్తి లేనంత మాత్రాన పనికిమాలిన వాడిని అవుతానా? నన్ను పొగడొచ్చు కదా , అసలు నాకు సామ్రాట్ కి మధ్య హ్యాండ్ రెస్లింగ్ ఎందుకు మొదలు పెట్టావు? అని లాస్యను తిడతాడు. నీ ఆనందం కోసమే కదా! చెప్పింది ,అయినా నువ్వు అందులో గెలిచావు కదా ఇంకేంటి బాధ అని లాస్య అడగగా, నేను గెలవలేదు. సామ్రాట్ కావాలని నన్ను గెలిపించాడు. తులసి సామ్రాట్ ని ఓడిపోమని చెప్పింది నాకల్లారా నేను దాన్ని చూశాను అని అంటాడు నందు. అప్పుడు లాస్య నిజంగానే విషయం నాకు తెలీదు.