నేనేమీ నీ జాతకం చూడలేదు అని అంటాడు నందు.మరి నా అదృష్టం గురించి మీకు ఎలా తెలుసు అని అడగగా బెస్ట్ బిజినెస్ మాన్ కి పార్ట్నర్ గా ఉండడం, తీరని కోరికలు నెరవేర్చుకోవడం, ఫ్లైట్లో ఎక్కడం, క్యాండిల్ లైట్ డిన్నర్లు చేయడం, ఇవన్నీ చూసి అర్థమైంది అని అంటాడు నందు. అప్పుడు తులసి మీకు ఈర్షగా ఉందా? అని అడుగుతుంది. నాకెందుకు ఈర్షగా ఉంటుంది అయినా నేను నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను నీ మాజీ భర్త అనే విషయం సామ్రాట్ గారికి చెప్పొద్దు అని నందు అనగా నేను చెప్పాను కదా నా అంతట నేను చెప్పను కానీ సామ్రాట్ గా అడిగితే మాత్రం అబద్ధం చెప్పను అని అంటుంది తులసి.