Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ... 

Published : Aug 19, 2022, 02:40 PM ISTUpdated : Aug 19, 2022, 03:22 PM IST

కే రాఘవేంద్రరావు సమర్పణలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది వాంటెడ్ పండుగాడ్. దర్శకుడు శ్రీధర్ సీపన రూపొందించారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్ క్యాస్ట్ తో పాటు ఒకప్పటి జబర్దస్త్ బ్యాచ్ మొత్తం  నటించారు. ఆగస్టు 19న విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం...

PREV
17
Wanted PanduGod Review: వాంటెడ్ పండుగాడ్ రివ్యూ... 

కథ
భిన్న నేపధ్యాలు, అవసరాలు కలిగిన కొందరు వ్యక్తుల టార్గెట్ పండుగాడు(సునీల్). వాడిని పట్టుకోవాలని ఎవరికి వారు తమ ప్రయత్నాలు మొదలుపెడతారు. అసలు ఈ పండుగాడు ఎవరు? మాఫీయా, పోలీసులతో పాటు సాధారణ జనాల టార్గెట్ ఎందుకయ్యాడు? అసలు పండుగాడ్ని పట్టుకోవడం వల్ల వాళ్లకు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఇంతకీ పండుగాడిని పట్టుకున్నారా? అనేదే మూవీ కథ 
 

27


కొన్నేళ్ల క్రితం ఎవడిగోల వాడిదే టైటిల్ తో దర్శకుడు ఈవివి సత్యనారాయణ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. టాలీవుడ్ కమెడియన్స్ మొత్తాన్ని ఆ సినిమాలో వాడేశాడు. కామెడీ క్యారెక్టర్స్ తో సపరేట్ సపరేట్ కామెడీ ట్రాక్స్ రూపొందించి ఒకరికొకరికి పెద్దగా సంబంధం లేకుండా ఆ మూవీ సాగుతుంది. అన్ని పాత్రల మధ్య చిన్న లింక్ ఉంటుంది. 

37

వాంటెడ్ పండుగాడ్ మూవీ కూడా అలాంటిదే. ఈ చిత్రంలో కూడా పదుల సంఖ్యలో కమెడియన్స్ నటించారు. ఒకప్పటి జబర్దస్త్ యాంకర్స్, కమెడియన్స్ తో చిత్రాన్ని నింపేశారు. ప్రధాన పాత్ర చేసిన సునీల్ తో పాటు బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, సుడిగాలి సుధీర్, సప్తగిరి, తనికెళ్ళ భరణి, ఆమనీ, పృథ్వి, రఘుబాబు, శ్రీనివాసరెడ్డి, అనసూయ, దీపికా పిల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మంది ఈ మూవీలో నటించారు.

47

ఈ పాత్రలన్నీ తమ తమ ప్రయోజనాల కోసం పండు గాడిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ మూవీలో ఓ కథ, స్క్రీన్ ప్లే అంటూ ఉండదు. ఎక్కడిక్కడ కమెడియన్స్ తో కామెడీ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి. సిట్యువేషనల్ కామెడీ ప్రధానంగా సాగుతుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే జబర్దస్త్ కామెడీ టైప్ అన్న మాట.

57

కామెడీకి తోడు అనసూయ, దీపికా పిల్లి, విష్ణు ప్రియ లాంటి యాంకర్స్ చేత స్కిన్ షో చేయించారు. ఆ విధంగా రొమాంటిక్ అండ్ గ్లామర్ యాంగిల్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. నాణ్యమైన కామెడీ ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చదు. నాన్ సింక్ కామెడీ అందరికి నచ్చక పోవవచ్చు. అయితే ఓ వర్గం ప్రేక్షకులు ఎంటర్టైన్ కావచ్చు.

67
K Raghavendra rao


సాంగ్స్, బీజీఎమ్ ఏమాత్రం ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు కూడా అంత ఉన్నతంగా లేవు. లెక్కకు మించిన స్టార్ కమెడియన్స్ ఉన్నా... ఎవరి పాత్రకు న్యాయం చేయలేదు. నిమిషాల వ్యవధిలో పాత్రలు తెరపై మారిపోతూ ఉంటాయి. బ్రహ్మనందం కూడా అంతంత మాత్రమే. అయితే ఎవరి పాత్ర మేరకు వాళ్ళు మెప్పించే ప్రయత్నం చేశారు. మొత్తంగా చెప్పాలంటే వాంటెడ్ పండుగాడ్ ఏమాత్రం ఆకట్టుకోదు. చివరికి కామెడీ లవర్స్ కి కూడా నచ్చదు. జబర్దస్త్ తరహా కామెడీ ఇష్టపడే వారికి నచ్చవచ్చు. టాలీవుడ్ లో ఉన్న కమెడియన్స్ మొత్తం నటించగా... ఓ లుక్ వేద్దాం అనుకుంటే పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళండి.. 

77
wanted pandugod

నటీనటులు: సునీల్, శ్రీమతి అనసూయ, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి, డా. బ్రహ్మానందం, రఘు బాబు, అనంత్, పుష్పా జగదీష్, నిత్యా శెట్టి, వాసంతి, విష్ణుప్రియ, హేమ, షకలక, తనికెళ్ల భరణి
దర్శకత్వం: శ్రీధర్ సీపాన 

సినిమాటోగ్రఫీ: మహి రెడ్డి పండుగల

సంగీతం: పి.ఆర్ 
సమర్పణ: కే రాఘవేంద్రరావు 


రేటింగ్: 2.5
 

click me!

Recommended Stories