Janaki kalaganaledu: జ్ఞానాంబ కాబోయే అత్తగారని తెలుసుకున్న జెస్సి.. జానకికి అబద్దం చెప్పిన అఖిల్!

Published : Aug 19, 2022, 02:16 PM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 19వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం...  

PREV
15
Janaki kalaganaledu: జ్ఞానాంబ కాబోయే అత్తగారని తెలుసుకున్న జెస్సి.. జానకికి అబద్దం చెప్పిన అఖిల్!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జానకి ముడుపు కట్టడానికి గుడి బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తుంది.నా పెళ్లి జరిగేటప్పటికి నా కల నెరవేరదు అని నేను అనుకున్నాను కానీ మీ దయవల్ల ఇప్పుడు నా చదువుకి ఆటంకం రాకుండా ఉంది.మీరు ఈ కృప నాపై ఎన్నడు చూపిస్తూ నన్ను, నా భర్తని,నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచాలి. నేను కష్టపడి చదువి ఐపీఎస్ అవ్వాలి అని దేవుని కోరుకొని ముడుపు కడుతున్నప్పుడు రామా అక్కడికి వచ్చి జానకి తో పాటు కలిసి ముడుపు కడతాడు. ఆ తర్వాత సీన్లో జెస్సి సాంప్రదాయంగా తయారయ్యి గుడికి వస్తుంది. అప్పుడు అఖిల్ కి ఫోన్ చేసి నేను ఇక్కడే ఉన్నాను అఖిల్ అని అంటుంది. జెస్సీని చూసి అఖిల్ కంగారు పడతాడు.
 

25

మా ఇంట్లో వాళ్ళు చూస్తే పెద్ద సమస్య అవుతుంది. దయచేసి వెళ్ళిపో అని అఖిల్ అంటాడు. అప్పుడు జెస్సి ఈరోజు నా పుట్టినరోజు పైగా అందరం ఇక్కడ కలిసాము, ఈరోజు మీ అమ్మగారితో మాట్లాడే వచ్చు కదా అని అంటుంది. వీలు చూసుకుని ఒక మంచి రోజు మాట్లాడదాం ఈరోజు వద్దు అని అఖిల్ అంటాడు. అలాగే వాళ్ళిద్దరూ కొంచెం సేపు వాదించుకుంటారు. అదే సమయానికి జానకిరామాలు అటువైపు వస్తారు. ఈ లోగ జానకి అఖిల్ ని జెస్సి తో చూస్తుంది. జానకిని చూసిన అఖిల్ అక్కడి నుంచి పారిపోతాడు. నువ్వేంటి ఇక్కడ జెస్సి అని జానకి అడగగా  ఈరోజు నా పుట్టినరోజు అక్క అని స్వీట్ పెట్టి నా బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాను తన పేరు అఖిల్ అని అంటుంది.
 

35

ఈ లోగ జ్ఞానాంబా, ఏం చేస్తున్నావ్ జానకి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు? అని అంటుంది. తిను మొన్న నాకు అకాడమీలో పరిచయమైంది అత్తయ్య గారు నా ఫ్రెండ్ అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ,ఎదుటి మనిషి గురించి కొంచెం తెలుసుకొని పరిచయం చేసుకుంటే మంచిది పొగరికి బట్టలు వేసినట్టు ఉంటుంది ఈ పిల్ల. దీని గురించి నాకు మొన్నే తెలిసింది అని చెప్పి జానకిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది.అప్పుడు ఙ్ఞానాంబ, అఖిల్ తో అందరికీ ప్రసాదం పంచు అని అంటుంది. అప్పుడు జెస్సి, అంటే అఖిల్ ఈవిడ కొడుకా అని ఆశ్చర్య పోతుంది.
 

45

అంతట్లో అఖిల్ త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఆ తర్వాత సీన్లో అఖిల్ ఇంట్లో, వదినకు తెలిసిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు జానకి,అఖిల్ దగ్గరికి వెళ్లి నీకు జెస్సి కి మధ్య ఉన్న పరిచయం ఏంటి అని అడుగుతుంది. మేమిద్దరం కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని అఖిల్ అంటాడు. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంటే సరే  అంతకుమించి ఏవైనా ఉంటే మీ అమ్మగారి సంగతి నీకు తెలిసిందే. చాలా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అని అంటుంది. లేదు వదిన మేము కేవలం స్నేహితులం మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ జానకి మనసులో అనుమానం ఇంకా ఉంటుంది.
 

55

ఆ తర్వాత సీన్లో జానకి చదువుతూ అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.ఈలోగా రామ అక్కడికి వచ్చి ఏమైంది జానకి గారు నేను ఏమైనా సహాయం చేయనా అని అనగా ఏమి వద్దు రామ గారు నేను చదువుకుంటాను అని జానకి చదువుకుంటుంది. ఈలోగా రామ పక్కనే సోఫాలో పడుకుంటాడు. జ్ఞానాంబా ఇదంతా చూస్తూ ఉంటుంది. జానకిని చదివి తో పాటు భర్త మీద శ్రద్ధ కూడా చూపమన్నాను. కానీ తను కేవలం చదువుకే ప్రాధాన్యత ఇస్తుంది అని అనుకుంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!

Recommended Stories