తారకరత్న ధైర్యానికి మెచ్చుకోవచ్చు, తొలి సినిమాతోనే చిరంజీవికి పోటీగా దిగాడు.. చివరికి ఏమైందో తెలుసా

Published : Nov 21, 2025, 07:45 AM IST

Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న తన తొలి చిత్రంతోనే చిరంజీవికి పోటీగా బరిలోకి దిగారు. తారకరత్న డెబ్యూ మూవీ ఒకటో నెంబర్ కుర్రాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
చిరంజీవికి పోటీగా నందమూరి హీరో

సినిమా రంగంలో పోటీ సహజం. పోటీని తట్టుకుని నిలబడినప్పుడే రాణించడం వీలవుతుంది. చిరంజీవి తన కెరీర్ లో ఎందరో హీరోలతో పోటీ పడి అగ్ర స్థానానికి చేరుకున్నారు. 2003లో చిరంజీవి ఒక ఆసక్తికరమైన పోటీ ఎదుర్కొన్నారు. చిరంజీవి సినిమాకి పోటీగా ఓ నందమూరి హీరో రంగంలోకి దిగాడు. నందమూరి హీరో అంటే బాలకృష్ణ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ అయి ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ వీళ్ళు కాదు. ఆ హీరో దివంగత నటుడు నందమూరి తారకరత్న.

25
డెబ్యూ మూవీతోనే చిరంజీవి ఎదురెళ్ళిన తారకరత్న

నందమూరి తారకరత్న ఏకంగా తన తొలి చిత్రంతోనే చిరంజీవికి పోటీగా వచ్చారు. తారకరత్న 'ఒకటో నెంబర్ కుర్రాడు' చిత్రంతోనే హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. నందమూరి వారసుడు కావడంతో గ్రాండ్ లాంచ్ లభించింది. తారకరత్న తొలి చిత్రం వెనుక పెద్ద పెద్ద వాళ్ళు నిలబడ్డారు. చిరంజీవితో అత్యధిక బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన కోదండరామిరెడ్డి తారకరత్న తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రానికి రాఘవేంద్ర రావు స్క్రీన్ ప్లే అందించారు.

35
తారకరత్న సినిమా వెనుక పెద్దవాళ్ళు

రాఘవేంద్ర రావు, అశ్విని దత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇలా బడా దర్శకులు, నిర్మాతలు తారకరత్న తొలి చిత్రం వెనుక నిలబడడంతో మంచి హైప్ వచ్చింది. ఈ చిత్రంలో తారకరత్నకి జోడిగా రేఖ నటించింది. భారీ అంచనాలతో ఈ చిత్రం సరిగ్గా చిరంజీవి ఠాగూర్ చిత్రానికి వారం ముందు రిలీజ్ అయింది. పెర్ఫార్మెన్స్ పరంగా తారకరత్నకి మంచి మార్కులు పడ్డాయి. కీరవాణి సంగీతం ఆకట్టుకుంది.

45
సునామీలా దూసుకువచ్చిన చిరంజీవి

ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం యావరేజ్ గా బాక్సాఫీస్ వద్ద రాణిస్తున్న సమయంలో చిరంజీవి ఠాగూర్ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ఒక సునామీలా బాక్సాఫీస్ పై విరుచుకుపడ్డారు. దీనితో తారకరత్న చిత్రానికి నిరాశ తప్పలేదు. తన వెనుక పెద్ద దర్శకులు, నిర్మాతలు ఉన్నారనే ధైర్యంతో తారక రత్న తొలి చిత్రంతోనే చిరంజీవికి పోటీగా వచ్చారు. కానీ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం సోలోగా రిలీజ్ అయి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ సాధించేది.

55
క్రేజ్ ని సరిగ్గా వాడుకోలేకపోయిన తారకరత్న

మొత్తంగా ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం తారకరత్నకి మంచి డెబ్యూ చిత్రమే అనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత తారకరత్న ఒకేసారి ఏకంగా 9 సినిమాలకు సైన్ చేశారు. కానీ ఆ క్రేజ్ ని నిలబెట్టుకోవడంలో తారక రత్న విఫలం అయ్యారు. తారకరత్న సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇదిలా ఉండగా 2023లో తారకరత్న గుండెపోటు కారణంగా మరణించారు.

Read more Photos on
click me!

Recommended Stories