రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ, రేటింగ్‌.. రియల్‌ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?

Published : Nov 21, 2025, 05:44 AM IST

నూతన నటీనటులతో సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `రాజు వెడ్స్ రాంబాయి`. విలేజ్‌ నేపథ్యంలో సాగే ఈ లవ్‌ స్టోరీ నేడు విడుదలయ్యింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. 

PREV
16
`రాజు వెడ్స్ రాంబాయి` మూవీ రివ్యూ

అఖిల్ రాజ్‌, తేజస్విని జంటగా నటించిన మూవీ `రాజు వెడ్స్ రాంబాయి`. సాయిలు కంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డా నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సబల్టర్న్ ఫిల్మ్స్, మాన్‌సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి నిర్మించారు. ఈటీవీ విన్‌ ఒరిజినల్స్ తో కలిసి వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాసు గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విలేజ్‌ లవ్ స్టోరీతో సాగే ఈ మూవీని నేడు శుక్రవారం(నవంబర్ 21న) విడుదలయ్యింది. ఈ యదార్థ విలేజ్‌ లవ్‌స్టోరీ ఆడియెన్స్ ని మెప్పించిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

26
`రాజు వెడ్స్ రాంబాయి` మూవీ కథ

2010లో తెలంగాణలోని ఒక గ్రామంలో జరిగే కథ ఇది. ఓ విలేజ్‌లో రాజు(అఖిల్‌ రాజ్‌) బ్యాండ్‌ వాయిస్తుంటాడు. లోకల్‌లో రాజు బ్యాండ్‌ కి మంచి పేరుంది. తండ్రి(శివాజీ రాజా) ఈ బ్యాండ్‌ వదిలేసి పట్నం వెళ్లి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పినా వినకుండా ఆ బ్యాండ్‌నే నమ్ముకుని ఉంటాడు. అదే ఊర్లో కాంపౌండర్‌ వెంకట్‌(చైతన్య జొన్నలగడ్డ) కూతురు రాంబాయి(తేజస్విని) ని ఇష్టపడుతుంటాడు. చాలా రోజులుగా ఆమెనే చూస్తుంటాడు. రకరకాలుగా ఆమెపై ఇష్టాన్ని తెలియజేస్తుంటాడు. `రాజు వెడ్స్ రాంబాయి` అని బ్యాండ్‌ మీద రాసుకుంటాడు, రాంబాయి పేరుని పచ్చబొట్టు పొడిపించుకుంటాడు. రాంబాయికి రాజు బ్యాండ్ కొట్టే విధానం బాగా ఇష్టం. పైకి అతన్ని కోపంగా చూసినా, లోలోపల మాత్రం ఎంజాయ్‌ చేస్తుంది. ఓ రోజు ఎట్టకేలకు తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. మొదట నో చెబుతుంది. తిడుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కరిగిపోతుంది. ఆమె కూడా ప్రేమలో పడుతుంది. వీరి లవ్‌స్టోరీ ఊర్లో టామ్‌ టామ్‌ అవుతుంది. ఇది కాస్త రాంబాయి తండ్రి వెంకట్‌కి తెలుస్తుంది. అతను రాజుకి గట్టి వార్నింగ్‌ ఇస్తాడు. ఇంటికొచ్చి పెద్ద గొడవ చేస్తాడు. ఈ గొడవలో రాజు తండ్రిని అనరాని మాటలు అంటాడు వెంకట్‌. అదే సమయంలో రాజుకి, తండ్రికి మధ్య గొడవ అవుతుంది. దీంతో బాగా ఫీలైన రాజు ఫాదర్‌ చనిపోతాడు. దీంతో రాజు తన ప్రేమ వల్లే తండ్రిని కోల్పోయానని బాధపడతాడు. తండ్రి కోరిక మేరకు ఊరు విడిచి పట్నం వెళ్తాడు. అక్కడ పెట్రోల్‌ బంక్ లో పనిచేస్తుంటాడు. బంక్‌ హోనర్‌తో గొడవపడి మళ్లీ ఊరు వస్తాడు. మళ్లీ రాంబాయిని కలుసుకుంటారు. ప్రేమించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయికే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని పంతంతో ఉంటాడు వెంకట్‌. మరి రాంబాయిని దక్కించుకునేందుకు రాజు ఏం చేశాడు? రాజుని పెళ్లి చేసుకునేందుకు రాంబాయి ఎలాంటి సాహసానికి తెగించింది? పరువు కోసం వెంకట్‌ ఎంతటి దారుణానికి తెగబడ్డాడు? అనేది మిగిలిన కథ.

36
`రాజు వెడ్స్ రాంబాయి` మూవీ విశ్లేషణ

రియల్‌ గా జరిగిన కథాంశంతో రూపొందించిన చిత్రమిది. విలేజ్‌ నేపథ్యంలో లవ్‌ స్టోరీ రియాలిటీగా, నిజాయితీగా చెబితే కచ్చితంగా ఆకట్టుకుంటాయి. అలా రూపొందించిన చిత్రమే `రాజు వెడ్స్ రాంబాయి`. చాలా రియాలిటీకి దగ్గరగా, రూటెడ్‌ లెవల్‌లో ఈ మూవీని రూపొందించారు. ఒక జెన్యూన్‌ అండ్‌ హానెస్ట్ గా చేసిన ప్రయత్నంగా చెప్పొచ్చు. విలేజ్‌ లో 2010లో జరిగే ప్రేమ కథ అంటే చాలా రూటెడ్‌గా ఉంటుంది. చాలా రియాలిటీగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌లు రాని రోజులు, డబ్బా ఫోన్లు వాడుతున్న రోజులవి. అంతేకాదు ఊర్లలో ప్రేమించుకోవడం, ఒకరినొకరు చూసుకోవడం, గణేష్‌ పండగ టైమ్‌లో కలుసుకోవడం, సైట్ కొట్టుకోవడం అంతా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అప్పటి లవ్‌ స్టోరీ చిత్రాల్లోని పాటలు(సంపంగి, కొత్త బంగారులోకం) వింటూ ఎంజాయ్‌ చేసే రోజులు అవి. ఇందులో వాటిని వినిపిస్తూ ప్రేమని వ్యక్తం చేసే తీరుని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 90 కిడ్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా చాలా రియాలిటీకి దగ్గరగా ఆయా సీన్లని రూపొందించారు. ఎక్కడా ఓవర్‌ డ్రామా, కమర్షియాలిటీ ఉండదు. అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్‌. మెయిన్‌ లీడ్‌లో నటించిన ఆర్టిస్ట్ లు కూడా అంతే సహజంగా ఉండటంతోపాటు, అంతే సహజంగా యాక్ట్ చేయడంతో ఆయా సీన్లు బాగా పండాయి. ఆ రోజుల్లో బ్యాండ్‌ కొట్టే తీరు, దాన్ని పోరగాళ్లు ఎంజాయ్‌ చేయడం వంటివి కూడా నేచురల్‌గా చూపించారు. ఆ సమయంలోనే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ని నడిపించిన తీరు అదిరిపోయింది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. ఇక పోరగాళ్లు రొమాంటిక్‌ సినిమాలను సీక్రెట్‌గా చూడటం, చిన్న చిన్న ఫోన్లలో బిట్ల కోసం తాపత్రయపడటం వంటి సీన్లు హైలైట్‌గా చెప్పొచ్చు. వంద రోజుల పనికి వెళ్లడం, ఫ్రెండ్స్ తో సరదా కామెంట్లు ఆద్యంతం నవ్వులు పూయిస్తాయి. ఫస్టాఫ్‌ అంతా ఇలానే సాగుతుంది.

46
`రాజు వెడ్స్ రాంబాయి` మూవీ హైలైట్స్, మైనస్‌లు

ఇంటర్వెల్‌తో కథ ఎమోషనల్‌గా, సీరియస్‌గా మారుతుంది. మళ్లీ లవ్‌ స్టోరీ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ సారి ఎమోషనల్ గా ఉంటుంది. ప్రేమ కోసం ఇద్దరు పడే స్ట్రగుల్స్ గుండెని బరువెక్కిస్తాయి. గొడవలు, కొట్టుకోవడం, ప్రేమించుకోవడం, ఇలా డ్రామా బాగా రక్తికటిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ముగుస్తుంది. పరువు కోసం హీరోయిన్‌ తండ్రి చేసే దారుణం అయ్యో అనిపిస్తుంది. మొత్తంగా సినిమా ఆ రోజుల్లోకి తీసుకెళ్లి, ఆ నాటి తీపి గుర్తులను గుర్తు చేసి నవ్వించి ఏడిపిస్తుంది. ఫన్‌, లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌లా ఉంటుంది. అయితే ఫస్టాఫ్‌లో ఉన్నంత వినోదం సెకండాఫ్‌లో తగ్గింది. కొంత లాజిక్ లెస్‌గా, కొంత ల్యాగ్‌ అనేలా, అక్కడక్కడే తిప్పినట్టుగా ఉంటుంది. సెకండాఫ్‌ ని మరింత గ్రిప్పింగ్‌గా చేయాల్సింది. ఎమోషనల్‌ సీన్లు లైటర్‌వేలోనే ఉంటాయి. వాటి తీవ్రత పెంచాల్సింది. సంఘర్షణలో డెప్త్ పెంచాల్సింది. లవ్‌ స్టోరీ కూడా ఇంకా డెప్త్ గా చూపించినా నష్టం లేదు, ఎందుకంటే ఆయా సీన్లని ఆడియెన్స్ బాగా ఎంజాయ్‌ చేస్తారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సినిమా అదిరిపోయేది. పరువు హత్యలకు సంబంధించిన అంశం ఇందులో చర్చించారు. అయితే ఆ విషయాన్ని అంతర్లీనంగా చూపించిన తీరు బాగుంది.

56
`రాజు వెడ్స్ రాంబాయి` నటీనటుల పర్‌ఫెర్మెన్స్

రాజుగా అఖిల్‌ రాజ్‌ అదరగొట్టాడు. పాత్రలో జీవించాడు. కొత్త నటుడు కావడంతో మనకు ఫ్రెష్‌ ఫీలింగ్‌ ఇస్తుంది. సినిమా లవ్‌ స్టోరీలాగే నటీనటులు కూడా కొత్త కావడం హైలైట్‌గా చెప్పాలి. అఖిల్‌ తన బెస్ట్ ఇచ్చాడు. ఇక రాంబాయిగా తేజస్విని అదరగొట్టింది. ఆ పాత్రకి బాగా సూట్‌ అయ్యింది. అంతే సహజంగా చేసింది. అఖిల్‌, తేజస్విని పాత్రలే ఈ సినిమాకి పెద్ద బలం. ఆయా నటుల నటన ఆ పాత్రలను మరింత హైలైట్‌గా నిలిపాయి. హీరోయిన్‌ తండ్రిగా చైతన్య జొన్నలగడ్డ పాత్ర మరో హైలైట్‌. ఆయన ఈ చిత్రంతో నోటెడ్‌ అవుతాడని చెప్పొచ్చు. చాలా బాగా నటించాడు. రాజు తండ్రిగా శివాజీ రాజా కనిపించింది కాసేపే అయినా ఇంపాక్ట్ చూపించారు. అమ్మ పాత్రలో అనితా చౌదరీ కూడా బాగా చేసింది. హీరో ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్లు అదరగొట్టాడు. ముఖ్యంగా డాంబర్‌ రోల్‌ చేసిన అబ్బాయి ఇరగదీశాడు. మిగిలిన కుర్రాళ్లు కూడా సహజంగా నటించారు. మిగిలిన నటీనటులు పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

66
`రాజు వెడ్స్ రాంబాయి` టెక్నీషియన్ల పనితీరు

సురేష్‌ బొబ్బిలి సంగీతం సినిమాకి పెద్ద అసెట్‌. పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. అలరిస్తాయి. ఆల్బమ్‌ పెద్ద హిట్‌. ఇప్పటికే ఆడియెన్స్ ని అలరిస్తున్నాయి. సినిమాల్లోనూ కట్టిపడేస్తాయి. బీజీఎం సైతం అదిరిపోయింది. మ్యూజిక్‌ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఆ పల్లె అందాలను, ఆయా లొకేషన్లని సహజంగా క్యాప్చర్‌ చేశారు. ఎడిటింగ్‌ కూడా ఫర్వాలేదు. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు సాయిలు ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. రియాలిటీకి దగ్గరగా రూపొందించడంలోనే ఈ మూవీ సక్సెస్‌ అయ్యిందని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో మరికొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది.

ఫైనల్‌గా: రియాలిటీకి దగ్గరగా, నిజాయితీగా రూపొందించిన ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ `రాజు వెడ్స్ రాంబాయి`. 90 కిడ్స్ బాగా ఎంజాయ్‌ చేస్తారు. పరువు హత్యలకు సంబంధించిన పాయింట్‌ కలిచివేస్తుంది.

రేటింగ్‌ : 3

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories