హీరో నువ్వా నేనా, బాలయ్య ముఖం మీదే అడిగేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్.. సినిమా దొబ్బింది అని అప్పుడే అర్థమైంది

Published : Dec 28, 2025, 06:12 PM IST

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ తన సినిమాలో నటించకపోవడమే మంచింది అయింది అని, బతికిపోయావు అంటూ రవితేజతో అన్నారు. బాలకృష్ణ ఎందుకు అలా అన్నారో ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
15
బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్

నందమూరి బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ గ్యారెంటీ అని అభిమానులు నమ్మేవారు. అప్పట్లో వీరి కాంబోలో అంత మంచి చిత్రాలు వచ్చేవి. అయితే వీరి కాంబినేషన్ లో కూడా డిజాస్టర్ పడింది. అప్పట్లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో సినిమా అంటే కూడా మినిమం గ్యారెంటీ హిట్ అని అంతా నమ్మేవాళ్లు. కోదండరామిరెడ్డి తెరకెక్కించే సినిమాలు అంత అద్భుతంగా ఉండేవి.

25
రవితేజ నటించాల్సిన రోల్

బాలకృష్ణ, విజయశాంతి జంటగా కోదండ రామిరెడ్డి దర్శకుడిగా నిప్పురవ్వ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఫ్లాప్ అని బాలకృష్ణకి అర్థమైందట. అది కూడా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వల్ల. ఆ వివరాలని బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో రివీల్ చేశారు. ఆ ఎపిసోడ్ లో రవితేజ అతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో రవితేజ టాలీవుడ్ లో నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. నిప్పురవ్వ చిత్రంలో నటుడు రాజా రవీంద్ర నటించారు. వాస్తవానికి ఆ పాత్రలో తాను నటించాలి అని రవితేజ అన్నారు.

35
బతికిపోయావు అంటూ బాలకృష్ణ కామెంట్

మీ నిప్పురవ్వ చిత్రంలో నేను నటించాల్సింది. కానీ పరుచూరి బ్రదర్స్ రెకమండేషన్ తో రాజా రవీంద్ర దూరిపోయాడు అని రవితేజ బాలయ్యతో అన్నారు. బాలయ్య స్పందిస్తూ ఆ సినిమా నువ్వు చేయకపోవడమే మంచిది అయింది బతికిపోయావు అని అన్నారు. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్. షూటింగ్ టైంలో రాజా రవీంద్ర నాతో ఒక మాట అన్నాడు. బాబు ఈ సినిమాకి హీరో మీరా నేనా అని అడిగాడు. ఆ టైంలో నేను బాగా చిరాకుతో ఉన్నా.

45
అంత పెద్ద ఛేజింగ్ అవసరమా

విజయన్ మాస్టర్ నేతృత్వంలో భారీ ఛేజింగ్ నడుస్తోంది. అది రాజా రవీంద్రకి సంబంధించిన సన్నివేశమే. హీరో నువ్వా నేనా అని రవీంద్ర అడగడంతో కోపం వచ్చేసింది. ఏంట్రా మాట్లాడుతున్నావ్ అని అడిగా. రవీంద్ర సమధానం ఇస్తూ.. లేకుంటే ఏంటి బాబు.. నా లాంటి వెధవని రేయ్ నా చెల్లి మెడలో తాళి కట్టారా అని బెదిరిస్తే కట్టేస్తాను కదా. దానికి పోయి ఇంత పెద్ద ఛేజింగ్ సీన్ ఎందుకు బాబు అని అడిగాడు.

55
సినిమా దొబ్బింది

రాజా రవీంద్ర అన్న మాటతోనే ఈ సినిమా దొబ్బింది అని అర్ధమైనట్లు బాలయ్య ఓపెన్ గా చెప్పారు. రాజా రవీంద్ర కోసం భారీ ఛేజింగ్, హెలికాఫ్టర్లు ఇలా పెద్ద హంగామా చేశారు. ఇంత అవసరమా అని అనిపించింది. మొత్తానికి నిప్పురవ్వ సినిమా డిజాస్టర్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories