Actress Rameshwari: నటి రమేశ్వరి నిజం సినిమా గురించి, మహేష్ బాబుతో తన అనుభవాల గురించి ఇతీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తక్కువ పారితోషికం తీసుకున్నందుకు మహేష్ బాబు తనను మందలించాడని తెలిపింది.
ప్రముఖ నటి రమేశ్వరి.. 'నిజం' సినిమా సమయంలో తనకు, హీరో మహేష్ బాబుకు మధ్య జరిగిన పలు సంఘటనల గురించి తెలిపింది. ఇటీవల ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు పేర్కొంది. దర్శకుడు తేజ నుంచి ఓ రోజు ఊహించని కాల్ వచ్చిందని.. తద్వారా తాను నిజం సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా పేర్కొంది.
25
దర్శకుడు తేజ ఇలా అన్నాడు..
దర్శకుడు తేజ తనకు ఫోన్ చేసి, ఒక పాత్ర ఉందని, ఇష్టమైతే చేయొచ్చునని చెప్పినట్టుగా నటి రమేశ్వరి వివరించింది. మొదట్లో హీరో ఎవరనే దానిపై తాను ఆసక్తి చూపలేదని, కేవలం పాత్రకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చానని తెలిపింది. ఈ పాత్రకు మొదట రేఖ, జయసుధ లాంటి వారిని సంప్రదించినా.. వాళ్లు నో చెప్పారని.. ఆపై తాను ఎంట్రీ ఇచ్చినట్టుగా పేర్కొంది.
35
మహేష్ బాబు తిట్టాడు..
చిత్రం షూటింగ్ పూర్తయ్యాక.. తన పారితోషికం గురించి హీరో మహేష్ బాబు తెలుసుకుని.. తనను మందలించినట్టు ఆమె వెల్లడించింది. "ఏంటి ఇంత తక్కువ పారితోషికానికి చేశారా మీరు" అని మహేష్ బాబు తనను నిలదీశాడని చెప్పింది. తాను ఎప్పుడూ పారితోషికం గురించి పట్టించుకోలేదని, ఎంత అడగాలో తనకు తెలియదని రమేశ్వరి పేర్కొంది.
నిజం షూటింగ్ సమయంలో మహేష్ బాబు, దర్శకుడు తేజ తన నటనా శైలిని చూసి వెక్కిరించేవారని, తాను డైలాగ్స్ బాగా కంఫర్టబుల్‌గా అనిపించే వరకు చెప్పనని, పాత్రలో లీనమవ్వడమే ముఖ్యమని ఆమె వివరించింది. ఒక సన్నివేశంలో తన కళ్ల నుంచి నీళ్లు ఎలా వచ్చాయని మహేష్ బాబు ఆశ్చర్యంతో అడిగారని, అది తన పాత్రలోని లీనతకు నిదర్శనమని తెలిపింది.
55
నిజం తర్వాత అవకాశాలు
నిజం మూవీ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. నేను ఆఫర్స్ లేకుండా ఖాళీగా ఉన్నా.. దర్శకుడు తేజ మళ్లీ పిలవలేదు. తాను లాజిక్, ప్రశ్నలు ఎక్కువగా అడగడం వల్లనే అవకాశాలు తగ్గిపోయాయని అనుకున్నట్టుగా రమేశ్వరి అభిప్రాయపడింది. అర్థం లేని పాత్రలు, నేపథ్యం లేని తల్లి పాత్రలు చేయనని, తన పాత్రకు ఒక అర్థం ఉండాలని తాను కోరుకుంటానని రమేశ్వరి స్పష్టం చేసింది.