ఆ స్టార్ హీరోయిన్ వల్ల పరువు పోయింది.. ఓపెన్‌గా చెప్పేసిన నటుడు రవిబాబు

Published : Dec 28, 2025, 05:31 PM IST

Director Ravi Babu: దర్శకుడు రవిబాబు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నాడు. 'అనసూయ' చిత్రం షూటింగ్ సమయంలో నటి భూమికతో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పేర్కొన్నాడు.

PREV
15
దర్శకుడిగా, నటుడిగా..

సీనియర్ నటుడు చలపతిరావు కొడుకు అయినప్పటికీ.. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి దర్శకుడు రవిబాబు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నాడు. ఎన్ని సినిమాలు నటించినా సరైన గుర్తింపు రాకపోగా.. దర్శకుడిగా మారి.. వెర్సటైల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు.

25
అనసూయ చిత్రం షూటింగ్‌లో..

ఒక నటుడిగా తాను 'అనసూయ' చిత్రం షూటింగ్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నానని రవిబాబు తెలిపాడు. ఆ సినిమాలో పాత్ర డిమాండ్ మేరకు శారీరక మార్పులకు లోనవ్వాల్సి వచ్చిందన్నారు. జుట్టు, ఫ్రెంచ్ బియర్డ్‌తో ఉన్న పాత్ర నుంచి గుండుతో, కనుబొమ్మలు లేని రూపానికి మారాల్సి వచ్చింది అని తెలిపాడు.

35
ఆ సమయంలో ఇలా..

ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ సీన్ కోసం ఒక అద్దంలో ప్రతిబింబాన్ని చూపించి, ఆ వెంటనే గుండు, కనుబొమ్మలు లేని తన రూపాన్ని తెరపై చూపించే షాట్‌ను చిత్రీకరించాల్సి ఉంది. దీని కోసం జుట్టును పూర్తిగా తీయించుకొని, కనుబొమ్మలను కూడా తొలగించుకున్నానని రవిబాబు తెలిపాడు. ఆ రోజు హీరోయిన్ భూమికతో కలిసి షూటింగ్‌ చేస్తున్నప్పుడు, మధ్యాహ్నం ఆమె ఐ యామ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పి వెళ్లిపోయిందని రవిబాబు తెలిపాడు.

45
ఒక్క రోజు కాదు 14 రోజులు..

నటికి అనారోగ్యం కారణంగా షూటింగ్‌కు ఒక రోజు సెలవు ఇచ్చాను. మరుసటి రోజు షూటింగ్ చేసుకోవచ్చని అనుకున్నాను. అయితే, మరుసటి రోజు భూమిక ఫోన్ చేసి తాను ముంబై వెళ్లాల్సి ఉందని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వస్తానని చెప్పింది. అనూహ్యంగా భూమిక 14 రోజుల పాటు షూటింగ్‌కు తిరిగి రాలేదు.

55
14 రోజులు ఇబ్బందులు..

ఆమె 14 రోజుల గైర్హాజరులో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని రవిబాబు అన్నాడు. తన విచిత్రమైన రూపం వల్ల ఎక్కడికి వెళ్లాలన్నా, పెద్ద కళ్లజోడు, టోపీ ధరించి బయట తిరగాల్సి వచ్చేదని పేర్కొన్నాడు. ఒకవేళ ఈ సంఘటన తాను గుండు చేయించుకోవడానికి ఒక రోజు ముందు జరిగి ఉంటే, ఆ 14 రోజులు తాను తన సాధారణ రూపంలో ఉండగలిగేవాడినని రవిబాబు అన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories