చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ అనేది సహజం. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవుతుంటే ఫ్యాన్స్ లో హంగామా, పోటీతత్వం ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో ఒక చిత్రం వల్ల మరో చిత్రం నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. సోగ్గాడు శోభన్ బాబు, క్రేజీ హీరో సుమన్ అప్పట్లో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించారు.
25
సుమన్, శోభన్ బాబు నటించిన చిత్రం
వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన దోషి నిర్దోషి చిత్రం మంచి విజయం సాధించింది. కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కావలసిన ఈ చిత్రం చాలా వరకు రెవెన్యూ నష్టపోయింది. సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ ఈ ఈ చిత్రానికి వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. దానికి కారణం నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి.
35
సుమన్, శోభన్ బాబు చిత్రానికి ఝలక్
బాలయ్య, విజయశాంతి, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన లారీ డ్రైవర్ చిత్రం 1990 డిసెంబర్ 21న రిలీజ్ అయింది. దోషి నిర్దోషి చిత్రం రిలీజ్ అయిన వారం తర్వాత ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లారీ డ్రైవర్ చిత్రానికి కూడా సూపర్ హిట్ టాక్ రావడంతో దోషి నిర్దోషి చిత్రానికి వసూళ్లు తగ్గిపోయాయి.
ఆ విధంగా సుమన్, శోభన్ బాబు కలిసి నటించిన చిత్రానికి నష్టం జరిగింది. బాలయ్య, బి గోపాల్ కాంబినేషన్ లో తొలిసారి వచ్చిన చిత్రం లారీ డ్రైవర్. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి.
55
అందుకే నష్టం
దోషి నిర్దోషి, లారీ డ్రైవర్ చిత్రాలు వారం రోజుల గ్యాప్ లో రిలీజ్ అవడం వల్లే నష్టం జరిగింది. ఈ రెండు చిత్రాలు మరి కొన్ని రోజులు ఎక్కువ గ్యాప్ లో రిలీజ్ అయి ఉంటే దోషి నిర్దోషి చిత్రం కూడా బ్లాక్ బస్టర్ లిస్ట్ లోకి చేరేది. దోషి నిర్దోషి చిత్రంలో సుమన్, శోభన్ బాబుతో పాటు లిజ్జీ ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించారు. లిజ్జీ ప్రియదర్శన్ ఎవరో కాదు.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్ తల్లి.