అనసూయ చీరలో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తూ దిగిన పిక్స్ ని పంచుకోగా, నెటిజన్లు క్రేజీగా స్పందిస్తున్నారు. కానీ వారిలో చాలా మార్పు కనిపిస్తోంది.
మాజీ జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఆమె మొన్నటి వరకు `కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` షోకి జడ్జ్ గా చేసింది. అలాగే సినిమాల్లోనూ మెరుస్తోంది. గతేడాది వరకు సినిమాల్లో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు అక్కడ ఆఫర్లు తగ్గినట్టు తెలుస్తోంది. ఇటీవల అనసూయ నటించిన సినిమాలేవి విడుదల(హరి హర వీరమల్లు`లో కేవలం సాంగ్‌లో మెరిసింది) కాలేదు. దీంతో ఆమెకి ఆఫర్లు తగ్గాయనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు బుల్లితెరపై పోకస్ పెట్టినట్టు సమాచారం.
DID YOU KNOW ?
పవన్‌తో మొదటిసారి
అనసూయ పవన్ కళ్యాణ్‌తో మొదటిసారి యాక్ట్ చేసింది. `హరి హర వీరమల్లు`లో ఆమె `కొల్లగొట్టినాదిరో` పాటలో మెరిసింది. పవన్‌తో కలిసి స్టెప్పులేసింది.
28
వరలక్ష్మీ వ్రతం చేస్తూ అనసూయ
ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకుంది అనసూయ. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.
38
అందరు బాగుండాలని కోరుకున్న అనసూయ
అంతేకాదు సర్వేజన సుఖినోభవంతు శ్లోకాన్ని పోస్ట్ చేసి అందరు బాగుండాలని కోరుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో రచ్చ చేసే అనసూయ ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడంతో ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు.
అదే సమయంలో అనసూయ మంచి మనసుకి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె ఇంట్లో తన భర్త సుశాంక్, పిల్లలతో కలిసి వరలక్ష్మి వ్రతం చేస్తూ కనిపించింది. ఇటీవల వరలక్ష్మి వత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని అనసూయ ఇలా పూజలు నిర్వహించింది. చాలా భక్తి శ్రద్దలతో ఆమె ఈ వ్రతం చేయడం విశేషం.
మరికొందరు చీరలో అనసూయని చూసి ముచ్చటపడుతున్నారు. చీరలో అనసూయ చాలా బాగుందని, ఎంతో అందంగా కనిపిస్తుందని అంటున్నారు. చివర్లో తన కాళ్లకి మెట్టలు, చేతి రింగులు చూపిస్తూ ఫోటోని పంచుకోగా, ఆ పిక్స్ పై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.
78
అనసూయ విషయంలో నెటిజన్లలో మార్పు
చాలా వరకు గ్లామర్ ఫోటోలతో ఆకట్టుకునే అనసూయ ఇలా ట్రెడిషనల్‌గా కనిపించడం నెటిజన్లకి కొత్త ఫీలింగ్‌నిస్తుంది. అయితే గతంలో ఆమె ఫోటోలపై చాలా వరకు నెగటివ్ కామెంట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు చాలా వరకు పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. అనసూయలో మార్పే కాదు, నెటిజన్లలోనూ ఆమె విషయంలో మార్పుకి ఇది అద్దం పడుతుంది.
88
`హరి హర వీరమల్లు`లో మెరిసిన అనసూయ
చివరగా పవన్ కళ్యాణ్ `హరి హర వీరమల్లు` చిత్రంలో మెరిసింది అనసూయ. ఇందులో `కొల్లగొట్టినాదిరో` పాటలో పవన్‌తో కలిసి స్టెప్పులేసింది. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలిచింది. కానీ మూవీ బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. అనసూయ చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. కానీ విడుదలకు నోచుకోవడం లేదు.