ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు, తెలుగులో అలాంటివారు లేరా ? ఎన్టీఆర్ కామెంట్స్ తో రగిలిన రగడ

Published : Aug 11, 2025, 03:06 PM ISTUpdated : Aug 11, 2025, 03:07 PM IST

ఎన్టీఆర్ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొన్ని కామెంట్స్ ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన చర్చకి దారితీశాయి. 

PREV
15
వార్ 2పై భారీ అంచనాలు 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇద్దరు టాప్ స్టార్లు కలసి నటించడంతో వార్ 2పై  నెలకొన్నాయి. క్రిష్, ధూమ్ 2 లాంటి చిత్రాలతో హృతిక్ రోషన్ కి సౌత్ లో కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయ్యారు. దీనితో ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం వార్ 2 ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

DID YOU KNOW ?
వార్ 2 తెలుగు రైట్స్
ఆర్ఆర్ఆర్, దేవర తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులని నిర్మాత నాగవంశీ 80 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
25
ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్ 

ఆదివారం రోజు హైదరాబాద్ లో వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రసంగించిన విధానం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఎన్టీఆర్ అయితే చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. వార్ 2 మూవీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉంటుందని చెప్పాడు. దీనితో అభిమానులు కేరింతలు కొట్టారు. అయితే ఎన్టీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

35
ఇండియాలో గ్రేటెస్ట్ డ్యాన్సర్ అతడే 

ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అనే దానిపై తారక్ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే అది హృతిక్ రోషన్ అని  ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. ఇండియాలోనే ఆయన గ్రేటెస్ట్ డ్యాన్సర్ అని తారక్ తెలిపారు. ఈ విషయం హృతిక్ రోషన్ కి ఆల్రెడీ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను. అలాంటి మనిషి పక్కన డ్యాన్స్ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. 

45
ఫ్యాన్స్ మధ్య రచ్చ, చిరంజీవి డ్యాన్స్ వీడియోలు వైరల్ 

అయితే ఎన్టీఆర్ ఇలా కామెంట్స్ చేయడంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇండియాలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరనేదానిపై అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. కొందరు మెగా అభిమానులు చిరంజీవి డ్యాన్స్ క్లిప్స్ వైరల్ చేస్తూ.. తారక్ కామెంట్స్ ని ప్రశ్నిస్తున్నారు. హృతిక్ రోషన్ ని ఇండియాలోనే గ్రేటెస్ట్ డ్యాన్సర్ అని ఎందుకు పొగడాల్సి వచ్చింది. తెలుగులో అద్భుతమైన డ్యాన్సర్లు లేరా అని ప్రశ్నిస్తున్నారు. 

55
అమ్మ నాన్న తప్ప ఇంకెవరూ లేరు 

తాను చిత్ర పరిశ్రమలోకి ఒంటరిగా వచ్చానని చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. తాను తొలి చిత్రంతో ఎంట్రీ ఇచ్చేటప్పుడు పక్కన మా నాన్న, అమ్మ తప్ప ఇంకెవరూ లేరని ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వార్ 2 రిలీజ్ కి కొన్ని రోజుల ముందు ఎన్టీఆర్ ఇలా తన కామెంట్స్ తో చర్చనీయాశం అయ్యారు. 

Read more Photos on
click me!

Recommended Stories