పవన్ కళ్యాణ్ అట్టర్ ఫ్లాప్ మూవీ గురించి బాలయ్య కామెంట్స్..అందుకే అంత బాగా గుర్తు పెట్టుకున్నారా ?

First Published | Nov 1, 2024, 12:07 PM IST

నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉందని చెప్పొచ్చు. సినిమా రంగం, టివి రంగం, రాజకీయాలు ఇలా ప్రతి అంశంలో బాలయ్య సక్సెస్ అవుతున్నారు. సినిమాల్లో బాలయ్య హ్యాట్రిక్ విజయాలు సాధించారు.

నందమూరి బాలకృష్ణ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉందని చెప్పొచ్చు. సినిమా రంగం, టివి రంగం, రాజకీయాలు ఇలా ప్రతి అంశంలో బాలయ్య సక్సెస్ అవుతున్నారు. సినిమాల్లో బాలయ్య హ్యాట్రిక్ విజయాలు సాధించారు. బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో బాలయ్య చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. పాలిటిక్స్ లోను బాలయ్య బిజీగా ఉన్నారు. 

ప్రస్తుతం బాలకృష్ణ.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 109 చిత్రంలో నటిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 4 కూడా పార్లల్ గా సాగుతోంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబు అతిథిగా గ్రాండ్ గా ప్రారంభం అయింది. లేటెస్ట్ ఎపిసోడ్ కి లక్కీ భాస్కర్ చిత్ర యూనిట్ అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్ బాలయ్య షోకి హాజరయ్యారు. 

Also Read : బిగ్ బాస్ హౌస్ లో ఆ నలుగురు దండుపాళ్యం బ్యాచ్.. నక్క, పాములతో పోల్చుతూ నిజస్వరూపాలు బయటకి..

Latest Videos


Balakrishna

హారిక అండ్ హాసిని సంస్థ అధినేత చినబాబు.. నాగవంశీకి బాబాయ్. హారిక అండ్ హాసిని సంస్థ ఉండగానే చినబాబు, నాగవంశీ కలసి సితార ఎంటర్టైన్మెంట్స్ ని కూడా ప్రారంభించారు. రెండు బ్యానర్స్ వ్యవహారాల్ని నాగవంశీ చూసుకుంటూ ఉంటారు. ఇటీవల నాగవంశీ వరుస చిత్రాలు నిర్మిస్తున్నారు. హారిక అండ్ హాసిని, సితార సంస్థల గురించి నాగవంశీ బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మాకు కొన్ని ఫ్లాపులు ఎదురయ్యాయి. 

ముఖ్యంగా 2018లో భారీ అంచనాలు ఉన్న చిత్రాన్ని నిర్మించాం. ఆ మూవీ దారుణంగా డిజాస్టర్ అయింది. అప్పుడు మేము ఏం చేస్తున్నామో ఎటు వెళుతున్నామో అర్థం కాలేదు. త్రివిక్రమ్ గారు దాని నుంచి బయటకి వచ్చి మళ్ళీ రెండు బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇచ్చారు. అయితే ఆ సినిమా పేరు చెప్పడానికి నాగవంశీ ఆలోచిస్తున్న టైంలో బాలయ్య వెంటనే అజ్ఞాతవాసి అని అన్నారు. 

హారిక అండ్ హాసినికి ఎదురైన పెద్ద డిజాస్టర్ అంటే అజ్ఞాతవాసి అని చెప్పొచ్చు. అజ్ఞాతవాసి తర్వాత అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. బాలయ్యకి అజ్ఞాతవాసి చిత్రం అంత బాగా గుర్తుండడానికి కారణం ఉంది. అజ్ఞాతవాసి 2018 సంక్రాంతికి జనవరి 10న భారీ అంచనాలతో విడుదలైంది. రెండు రోజుల తర్వాత బాలయ్య నటించిన జై సింహా చిత్రం విడుదలయింది. అజ్ఞాతవాసి అంచనాల ముందు జై సింహా చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైంది. కానీ అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడం బాలయ్య జై సింహా చిత్రానికి కలసి వచ్చింది. 

జై సింహా చిత్రానికి గొప్ప టాక్ ఏమి రాలేదు. క్రిటిక్స్ నుంచి కూడా నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. కానీ అజ్ఞాతవాసి కంటే బెటర్ ఉందని అన్నారు. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో అజ్ఞాతవాసి చూద్దామనుకున్న వారు ఫ్లాప్ టాక్ రావడంతో జై సింహా వైపు వెళ్లారు. ఫలితంగా బాలయ్య జై సింహా చిత్రం బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయిపోయింది. 

click me!