ప్రభాస్ 'రాజా సాబ్' కీ ప్లాట్ ట్విస్ట్ లీక్ ?

First Published | Nov 1, 2024, 11:21 AM IST

సీనియర్ ప్రబాస్ ని మోసం చేస్తారు. దాంతో సంజయ్ దత్ పై పగ తీర్చుకోవటానికి దెయ్యమైన సీనియర్ ప్రభాస్ రాజా సాబ్ తిరుగుతూంటారు. 

Prabhas, The Raja Saab, maruthi


 
వరస హిట్స్ తో దూసుకుపోతున్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ...ఎవరూ ఊహించని విధంగా మారుతితో సినిమా చేస్తూ షాక్ ఇస్తున్నారు. ప్యాన్ ఇండియా హారర్ కామెడీగా రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రం ఇప్పటికే రిలీజైన మోషన్ పోస్టర్, అందులో ప్రభాస్ లుక్ తో షాక్ ఇస్తోంది. ఏప్రియల్ 10 న రిలీజ్ అయ్యే ఈ సినిమాపై మెల్లిమెల్లిగా అంచనాలు ఏర్పడుతున్నాయి.

ఈ సినిమాలో చాలా ట్విస్ట్ లు,షాక్ లు ఉన్నాయని, ప్రభాస్ నుంచి వస్తున్న ఆశ్చర్యపరిచే చిత్రం అని చెప్పుకుంటున్నారు. ఈ నేపఫధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ లీకైందని మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ లీకైన ఆ స్టోరీ లైన్ ఏమిటి

Prabhas, The Raja Saab, maruthi


 'ది రాజా సాబ్' నుంచి వచ్చిన మోషన్ పోస్టర్ లో ప్రభాస్ రాజసం ఉట్టిపడే రాయల్ లుక్ లో, కొంచం భయంకరంగా, మరింత కొత్తగా కనిపించారు.  ఈ పోస్టర్ లో ప్రభాస్ సింహాసనం మీద కూర్చుని చేతిలో సిగార్ తో రాజు లుక్ లో కొత్తగా కనిపించి మంచి హైప్ క్రియేట్ చేశారు. అదే సమయంలో  హర్రర్ నేపథ్యమున్న సినిమా అని ఈ మోషన్ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. అయితే అసలు ఈ చిత్రం  స్టోరీ లైన్ ఏమై ఉండవచ్చును అనే చర్చ మొదలైంది.


Actor Prabhas upcoming film The Raja Saab remuneration out


అందుతున్న సమాచారం మేరకు సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రభాస్ కు తాతగారు గా కనిపిస్తారు. ఆయనకు, ప్రభాస్ కు మధ్య చాలా సీన్స్ ఉంటాయి. ఇక ఈ సినిమా ప్లాష్ బ్యాక్ చంద్రముఖిని గుర్తు చేస్తుంది. అక్కడ మహారాజ్ గా రాయల్ లుక్, తెల్ల హెయిర్ స్టైయిల్ తో ఆయన కనిపిస్తారు.

సంజయ్ దత్ మెయిన్ విలన్...ఆయన సీనియర్ ప్రబాస్ ని మోసం చేస్తారు. దాంతో సంజయ్ దత్ పై పగ తీర్చుకోవటానికి దెయ్యమైన సీనియర్ ప్రభాస్ రాజా సాబ్ తిరుగుతూంటారు. అక్కడ కామెడీ పండుతూంటుంది. అయితే ఇదంతా ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినపడుతున్న టాక్ మాత్రమే. 

Prabhas, The Raja Saab, maruthi


  ప్రభాస్ ‘రాజా సాబ్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది స్పష్టం అయ్యింది.  ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో చూపించిన యంగ్ క్యారెక్టర్‌ ఒకటైతే.. ఇంకోటేమో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన మహా రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చెప్తున్నారు.

Prabhas, The Raja Saab, maruthi


అలాగే  మహా రాజు పాత్ర...ఈ సినిమాలో సెకండాఫ్ లో వస్తుంది. సాలిడ్ ఉండే ఈ ఫ్లాష్ బ్యాక్ ఇప్పటి  ప్రభాస్ కు తాతగారి పాత్ర ను రివీల్ చేస్తుందని సమాచారం. ఈ పోర్షన్ దాదాపు అరగంట దాకా ఉంటుందని, ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ చాలా క్రేజీగా ఉంటారని, డైలాగ్ డెలవరీ, మేనరిజమ్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయని వినికిడి. ఇప్పటివరకూ ప్రభాస్ ని అలా చూసి ఉండరని చెప్తున్నారు. 
 

The Raja Saab Prabhas horror film

 ప్రభాస్ కల్కి సూపర్ హిట్ తో ఆయన నెక్ట్స్ పిక్చర్ రాజా సాబ్ బిజినెస్ వర్గాల్లో క్రేజ్ మామూలుగా లేదు. మారుతి దర్శకుడు కాబట్టి పెద్దగా క్రేజ్ లేదనుకున్న వాళ్లకు ఈ ప్రాజెక్టుకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ చూస్తూంటే మతిపోతోంది. అఫ్ కోర్స్ అది ప్రభాస్ కు పెరిగిన ప్యాన్ ఇండియా మార్కెట్,

సక్సెస్ , ఫామ్ లో ఉండటం వంటి కారణాలు కావచ్చు. కానీ ప్రభాస్ తో సినిమా చేస్తున్న వాళ్లకి అవన్నీ కలిసొచ్చే అంశాలే. ప్రభాస్ సినిమా అంటే వందల కోట్లకు చేరుకుంది. అలాంటప్పుడు రిటర్న్స్ ఏ స్దాయిలో ఉంటాయా అని లెక్కలేసుకునే నిర్మాత చేస్తారు. కానీ సినిమాకు వస్తున్న బిజినెస్ ఆఫర్స్ ..ఆ  లెక్కలను దగ్గర రానిచ్చే పరిస్దితి లేదంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఆడియో రైట్స్ కు పలికిన రేట్లే అందుకు నిదర్శనం అంటున్నారు. 

Latest Videos

click me!