అందుకే ఆ మూవీ అట్టర్ ఫ్లాప్, మెగా హీరోకి అందరి ముందు అదిరిపోయే పంచ్ ఇచ్చిన బాలయ్య

Published : Jun 04, 2025, 07:41 AM IST

ఓ ఈవెంట్ లో బాలకృష్ణ మెగా హీరోకి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా బాలయ్య తన చిత్రం గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

PREV
15
వరుస విజయాలతో బాలయ్య 

నందమూరి బాలకృష్ణ ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. మనసులో అనిపించింది ధైర్యంగా చెప్పేస్తారు. కొన్నిసార్లు అలా మాట్లాడడం వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది. బాలయ్య ప్రస్తుతం తన కెరీర్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా బాలయ్య వరుసగా నాలుగు విజయాలు సాధించారు. ప్రస్తుతం అఖండ 2లో నటిస్తున్నారు.

25
మెగా హీరోకి కౌంటర్ 

ఓ ఈవెంట్ లో బాలకృష్ణ మెగా హీరోకి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. ఈ సందర్భంగా బాలయ్య తన చిత్రం గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మెగా హీరోకి, బాలయ్యకి మధ్య ఫన్నీగా సంభాషణ జరిగింది. ఇంతకీ ఆ మెగా హీరో ఎవరంటే అల్లు శిరీష్. ఓ ఈవెంట్ లో అల్లు శిరీష్ బాలయ్య వద్దకు వెళ్లి ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు.

35
సింహా టైటిల్ తో బాలయ్య చేసిన చిత్రాలు 

అల్లు శిరీష్ బాలయ్యని ప్రశ్నిస్తూ.. మీరు చేసిన చిత్రాల్లో  సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహా, జైసింహా, వీర సింహారెడ్డి..  సింహా అనే టైటిల్ తో వచ్చాయి. ఇవి కాకుండా మరో చిత్రాన్ని కూడా మీరు సింహా టైటిల్ తో చేశారు. ఆ చిత్రం ఏంటి అని అల్లు శిరీష్ ప్రశ్నించారు. బాలయ్య వెంటనే బొబ్బిలి సింహం అని అన్నారు. బొబ్బిలి సింహం కాకుండా మరొకటి ఉంది అని అల్లుడు శిరీష్ తెలిపారు. దీంతో బాలయ్య అల్లు శిరీష్ కి ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు.

45
అందుకే ఆ మూవీ అట్టర్ ఫ్లాప్

బొబ్బిలి సింహంలో సింహం కాకుండా పులి ఉందా అక్కడ. అందులో సింహం ఉంది కదయ్యా అని ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు. అది కాకుండా మరొక చిత్రం ఉంది... ఆ మూవీ పేరు సింహం నవ్వింది అని అల్లు శిరీష్ తెలిపారు. బాలయ్య వెంటనే స్పందిస్తూ.. అందుకే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అని అన్నారు. సింహం నవ్వడం ఏంటయ్యా.. అందుకే ఆ సినిమా పోయింది అంటూ తన సినిమా గురించి తానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

55
నందమూరి హరికృష్ణ నిర్మాణంలో..

సింహం నవ్వింది చిత్రంలో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. 1983లో యోగానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని నిర్మించింది మరెవరో కాదు.. బాలకృష్ణ సోదరుడు నందమూరి హరికృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read more Photos on
click me!

Recommended Stories