50 కోట్లతో తీస్తే 60కోట్ల నష్టం తెచ్చిన బాలయ్య సినిమా ఏంటో తెలుసా? తండ్రికోసం సాహసం, ఊహించని దెబ్బ

Published : Jun 03, 2025, 03:50 PM ISTUpdated : Jun 03, 2025, 03:53 PM IST

బాలకృష్ణ కెరీర్‌లో చాలా ప్లాఫ్‌లున్నాయి. కానీ ఒక సినిమా మాత్రం ఆయన్ని గట్టిగా దెబ్బకొట్టింది. తండ్రి కోసం రిస్క్ చేస్తే భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

PREV
16
వరుస సక్సెస్‌లో బాలకృష్ణ

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు వరుస సక్సెస్‌లో ఉన్నారు. కంటిన్యూగా నాలుగు హిట్లు అందుకున్న హీరోగా ఆయన నిలవడం విశేషం. ఒక్క సినిమా ఆడితే మూడు చిత్రాలు ఫ్లాప్‌ అవుతున్న ఈ టైమ్‌లో కంటిన్యూగా నాలుగు విజయాలు అందుకోవడం బాలయ్యకే సాధ్యమైంది. 

అంతేకాదు నాలుగూ వంద కోట్ల మూవీస్‌ కావడం విశేషం. ఇప్పుడు ఆయన `అఖండ 2`లో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారు. శివతత్వం ప్రధానంగా ఈ చిత్ర కథ సాగుతున్న నేపథ్యంలో ఇండియా వైడ్‌గా అన్ని భాషల వారికి రీచ్‌ అయ్యేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

26
50కోట్లతో సినిమా తీసి 60 కోట్లు నష్టపోయిన బాలయ్య

ఇదిలా ఉంటే బాలకృష్ణ.. ఇటీవల ఫెయిల్యూర్‌ లేకుండా రాణిస్తున్నారు. చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. కానీ గతంలో బాలయ్య నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. 

ఒక సినిమా విషయంలో నందమూరి నటసింహం చాలా నష్టపోయారు. గట్టి దెబ్బ ఎదుర్కొన్నాడు. 50 కోట్లతో సినిమా తీస్తే ఏకంగా 60కోట్లు నష్టపోవడం గమనార్హం. అయితే ఈ మూవీని బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తీశారు. తండ్రి ఎన్టీఆర్‌ కోసం సాహసం చేశారు. కానీ బోల్తా పడ్డారు.

36
తండ్రి ఎన్టీఆర్‌ జీవితంపై బయోపిక్‌

ఆ సినిమానే `ఎన్టీఆర్‌` బయోపిక్‌. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా చేసుకుని ఈ బయోపిక్‌ని రూపొందించారు దర్శకుడు క్రిష్‌. ఎన్టీఆర్‌ సినిమా జీవితం, రాజకీయ జీవితాన్ని ఇందులో చూపించారు. 

సినిమా కెరీర్‌ని `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`లో చూపిస్తే, రాజకీయ జీవితాన్ని `ఎన్టీఆర్‌ః మహానాయకుడు`లో చూపించారు.  కానీ ఈ మూవీస్‌ ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. అందరిని తీవ్రంగా నిరాశ పరిచాయి.

46
50కోట్లతో `ఎన్టీఆర్‌` బయోపిక్‌ చిత్రాలు

`ఎన్టీఆర్‌` బయోపిక్‌ చిత్రాన్ని సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీకి బాలకృష్ణనే నిర్మాత. తండ్రి కోసం ఆయన సొంతంగా ఎన్బీకే ఫిల్మ్స్ బ్యానర్‌ని స్థాపించి ఈ మూవీని నిర్మించారు. 

వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా  వంటి ప్రొడక్షన్స్ నిర్మాణంలో భాగమయ్యాయి. 2019 జనవరిలో సంక్రాంతికి కానుకగా మొదటి భాాగం `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`ని విడుదల చేశారు. ఈ మూవీ ఫస్ట్ రోజు నుంచే నెగటివ్ టాక్‌ తెచ్చుకుంది. దారుణంగా డిజాస్టర్‌గా నిలిచింది.

56
24కోట్లు వసూలు చేసిన `ఎన్టీఆర్‌ః కథానాయకుడు`

దాదాపు రూ.70-80 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కాగా, ఈ మూవీకి థియేట్రికల్‌గా సుమారు రూ.14కోట్ల షేర్‌ వచ్చింది. అరవై కోట్లకుపైగా నష్టాలు తెచ్చింది. ఆ తర్వాత నెల రోజులకు `ఎన్టీఆర్‌ః మహానాయకుడు` మూవీని రిలీజ్‌ చేశారు. 

తొలి భాగం ఆకట్టుకోలేకపోవడంతో రెండో భాగంపై కూడా జనం ఆసక్తి చూపించలేకపోయారు. దీంతో మొదటి ఆట నుంచే ఈ మూవీ కూడా డిజాస్టర్‌ టాక్ తెచ్చుకుంది. టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సినిమాని చూడకపోవడం గమనార్హం.

 రెండో పార్ట్ అయితే కనీసం రెండు కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది. ఇలా మొత్తంగా `ఎన్టీఆర్‌` బయోపిక్‌ ఆరవై కోట్లకుపైగా డిస్ట్రిబ్యూటర్లకి నష్టాలను మిగిల్చింది.

66
`ఎన్టీఆర్‌` బయోపిక్‌ డిజాస్టర్‌కి కారణాలివే

బాలకృష్ణ తన తండ్రి గురించి జనాలకు తెలియజేయాలని, ఆయన గొప్పతనం చాటి చెప్పాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.  ఈ సినిమా టీడీపీ ప్రాపగండా మూవీలాా ఉందనే టాక్‌ వినిపించింది. 

అందరికి తెలిసిన విషయాలనే చూపించారని, పైగా అంతా పాజిటివ్‌గానే చూపించారని, తెలియని విషయాలు, కొత్త విషయాలు ఏం లేవని, ఎన్టీఆర్‌ కి సంబంధించిన నెగటివ్‌ విషయాలను చూపించలేదని, సినిమాలో డ్రామా ఏమాత్రం పండలేదనే టాక్‌ వచ్చింది. మొత్తంగా తండ్రి కోసం బాలయ్య చేసిన సాహసం బెడిసి కొట్టింది. దారుణమైన నష్టాలను తెచ్చిపెట్టింది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories