Tejaswini Nandamuri: అరాచకం అంతే.. బాలయ్య చిన్న కూతురు ఊరమాస్ డాన్స్.. వీడియో వైరల్

Published : May 30, 2026, 09:36 AM IST

Tejaswini Nandamuri Dance: నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని క్రేజీ డాన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. భాను మాస్టర్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన బాలయ్య కూతురు వీడియో చూసి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు.

PREV
14
సైలెంట్‌గా వచ్చి డాన్స్‌తో ఇండస్ట్రీని ఊపేసిన తేజస్విని.. నెక్స్ట్ హీరోయిన్ ఎంట్రీనా?

సాధారణంగా నందమూరి ఫ్యామిలీ అనగానే ఒక హుందాతనం, కాస్త పద్ధతిగా కెమెరాల ముందుకు రావడం చూస్తుంటాం. ముఖ్యంగా బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి బిజినెస్ వరల్డ్‌లో బిజీగా ఉంటే.. చిన్న కూతురు తేజస్విని మాత్రం ఎప్పుడూ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ప్రైవేట్ లైఫ్‌కే ఇంపార్టెన్స్ ఇచ్చేవారు.

కానీ, సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు సోషల్ మీడియాలో తేజస్విని పేరు మారుమోగిపోతోంది. ఆమె చేసిన ఒక క్రేజీ డాన్స్ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అసలు బాలయ్య కూతురిలో ఈ రేంజ్ గ్రేస్, ఎనర్జీ ఉన్నాయా అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

24
భాను మాస్టర్‌తో కలిసి ఇరగదీసిన తేజస్విని!

రీసెంట్‌గా ఫేమస్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి తేజస్విని ఒక పాపులర్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. ఊరికే అలా అలా కాళ్లు కదపడం కాదు.. బీట్‌కు తగ్గట్టు పక్కా ప్రొఫెషనల్ డాన్సర్‌లా గ్రేస్‌తో, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో డాన్స్ ఇరగదీసేశారు.

ఆమె ఫేస్‌లో ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ చూసిన నందమూరి అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. “66 ఏళ్ల వయసులో కూడా మా బాలయ్య బాబు కుర్రాడిలా డాన్స్ వేస్తుంటే.. ఆయన రక్తం పంచుకు పుట్టిన కూతురు మాత్రం తక్కువ తింటుందా? తండ్రికి తగ్గ కూతురు!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

34
తెర వెనుక కింగ్.. ‘అన్‌స్టాపబుల్’ సక్సెస్ సీక్రెట్ ఈమే

చాలా మందికి తేజస్విని అంటే కేవలం విశాఖ ఎంపీ శ్రీ భరత్ భార్యగానే తెలుసు. చదువులో టాప్ అయిన తేజస్విని.. గత కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆహా ఓటీటీలో సూపర్ హిట్ అయిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షో వెనుక ఈమె మైండ్ ఉంది.

ఆ షోకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా, కన్సల్టెంట్‌గా తేజస్విని కీలక పాత్ర పోషించారు. బాలయ్య డబుల్ హ్యాట్రిక్ సక్సెస్ వెనుక, ఆయన విభిన్నమైన స్క్రిప్ట్ సెలక్షన్స్ వెనుక కూడా తేజస్విని జడ్జ్‌మెంట్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. సినిమాల్లోకి రాకపోయినా, ప్రొడక్షన్ వ్యవహారాలపై పూర్తి పట్టు సాధిస్తూ తెరవెనుక చక్రం తిప్పుతున్నారు.

44
జ్యువెలరీ యాడ్ నుండి డాన్స్ వరకు.. నెక్స్ట్ హీరోయిన్ ఎంట్రీనా?

మొన్నటికి మొన్న ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ యాడ్‌లో నటించి కెమెరా ముందు తన నటనతో మెప్పించారు తేజస్విని. అప్పుడే ఈమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుందా అనే టాక్ నడిచింది. ఇప్పుడు ఈ డాన్స్ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా డిస్కస్ చేసుకుంటున్నారు.

“ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్నాళ్లూ ఎందుకు దాచారు?”, “సినిమాల్లోకి వస్తే కచ్చితంగా స్టార్ అవుతారు” అంటూ ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ లలో కామెంట్లు పెడుతున్నారు. ఒక పక్క బాలయ్య కొడుకు మోక్షాజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తుంటే.. కూతురు తేజస్విని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లతో సోషల్ మీడియాను రూల్ చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories