Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ

Published : May 30, 2026, 08:00 AM IST

Karthika Deepam 2 Today Episode (మే 30వ తేదీ)లో ఫ్లెక్సీ కోసం జ్యోని ఫోటోలు తీసిన కార్తీక్. సూరజ్ ని లేకుండా చేస్తానన్న జ్యో. రెస్టారెంట్ బిజినెస్ పెడ్తానన్న కాశీ. జ్యోను సీఈఓగా పనికిరావన్న శివన్నారాయణ. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..  

PREV
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శనివారం ఎపిసోడ్ లో నీ షాప్ ముందు నా మనుమరాలి ఫ్లెక్సీ పెట్టాలా? అలా ఎలా కుదురుతుంది. దీనికి మేము ఒప్పుకోము. ఇంకా నయం జ్యోత్స్నని జ్యూస్ లు సర్వ్ చేయమని అడగలేదు అంటుంది పారు. మీరు చెప్పింది కూడా బాగానే ఉంది అలాగే చేయించండి అంటాడు సూరజ్. ఎక్కడైతే నా మర్యాద పోయిందో అక్కడే నిలబెట్టుకోవాలి. మేడం ఒక గంటసేపు జ్యూసులు సర్వ్ చేస్తే నా మీద, నేను అమ్మే హెల్తీ ఫుడ్ మీద అందరికీ నమ్మకం వస్తుంది అంటాడు సూరజ్. ఇందుకు నేను ఒప్పుకోను అంటుంది జ్యోత్స్న. ఎందుకు ఒప్పుకోవు, దానివల్ల నీకే సోషల్ మీడియాలో మంచి పేరు వస్తుంది అంటాడు కార్తీక్. సూరజ్ కోరుకున్న న్యాయం జరుగుతుంది అంటాడు శివన్నారాయణ.

26
జ్యోతో ఆడుకున్న కార్తీక్

ఆ తర్వాత కార్తీక్, దీప, సూరజ్, పారు బయటకు వెళ్లి జ్యోత్స్నను రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీస్తారు. ఈ ఫోటోలను నా ఫోన్ కి పంపించి, మేడం గారిని రేపు స్టాల్ దగ్గరకు తీసుకురా బ్రదర్ అని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. పారు నీ సపోర్ట్ మొత్తం జ్యోత్స్న వైపే ఉంది కదా అని డౌట్ పడతాడు కార్తీక్. లేదురా మనపై అనుమానం రావద్దని అలా నటిస్తున్నాను అని చెప్తుంది పారు. ఆ తర్వాత శివన్నారాయణ వచ్చి సూరజ్ లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మన వ్యాపారంలో ఉంటే బాగుంటుంది అంటాడు. చూద్దాం తాత ఎవరి భవిష్యత్ ఎలా ఉందో అంటాడు కార్తీక్.

36
జ్యో మరో ప్లాన్

మరోవైపు గదిలోకి వెళ్లిన జ్యోత్స్న ఉన్నదానివి ఉండక లేనిపోని సలహాలు ఇచ్చి నన్ను ఇరికించావు అని పారుపై ఫైర్ అవుతుంది. నువ్వు తప్పు చేసి నన్ను అంటావేంటే.. వాడితో గొడవ పెట్టుకోమని నేను చెప్పానా అంటుంది పారు. వాడు ఇంటివరకు వస్తాడనే విషయం నాకు తెలియదు కదా.. అయినా నేను వెళ్తే కదా.. వాడికి న్యాయం జరిగేది. రేపటి వరకు వాడు ఉండడు. వాని స్టాలూ ఉండదు అంటుంది జ్యోత్స్న. మళ్లీ ఏం చేస్తావే.. మీ తాత ఒప్పుకోడు. ఇలా వెళ్లి, అలా వస్తే సరిపోతుంది అంటుంది పారు. ఎక్కడ కొడితే నా ఈగో హర్ట్ అవుతుందో తెలిసే వాడు అలా చేశాడు. వాడ్ని నేను విడిచిపెట్టను అంటుంది జ్యోత్స్న.

46
కాశీ కొత్త బిజినెస్

మరోవైపు కావేరి, స్వప్న మాట్లాడుకుంటూ ఉంటారు. మీ నాన్న సీఈఓగా లేడు కాబట్టి అల్లుడు గారు డ్రైవర్ గా ఉండాల్సిన అవసరం లేదు.. కానీ ఏదో ఒక పని చూసుకోవాలి కదా అంటుంది కావేరి. ఆ మాటలు కాశీ విని బయటకు వెళ్లిపోతాడు. వెనకాలే వెళ్లిన స్వప్న ఫీల్ అయ్యావా అని అడుగుతుంది. లేదు మా అమ్మ అయినా ఆ మాటే చెప్తుంది అంటాడు కాశీ. అర్థం చేసుకున్నందుకు థాంక్యూ అంటుంది స్వప్న. నేను జాబ్ చేయను రెస్టారెంట్ బిజినెస్ చేస్తాను అని తన ఐడియా షేర్ చేసుకుంటాడు కాశీ. సంతోషిస్తుంది స్వప్న.

56
సీఈఓగా పనికిరావు

మరోవైపు తండ్రికి సారీ చెప్తాడు దశరథ. మీరు మిమ్మల్ని పెంచినట్లు మేము మా కూతురిని పెంచలేకపోయాము అని చెప్తాడు. దీనికి ఈ బుద్ధులు ఎందుకు వచ్చాయి అంటుంది సుమిత్ర. వయసులో ఉన్నవాళ్లు ఆ మాత్రం స్పీడుగా ఉంటారులే సుమిత్ర అంటుంది పారు. సూరజ్ విషయంలో నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకో తాత అంటుంది జ్యోత్స్న. ఎందుకు అంటాడు శివన్నారాయణ. ఇది మీ మనుమరాలు పరువుకు సంబంధించిన విషయం అంటుంది జ్యోత్స్న. రోడ్డుపై తనతో గొడవ పడినప్పుడు గుర్తులేదా పరువు గురించి అంటాడు శివన్నారాయణ. 

సూరజ్ ముందు ఒప్పుకున్నావు కదా.. ఇప్పుడు మళ్లీ ఏంటి అంటాడు దశరథ. గొడవ పెద్ది చేయద్దని ఒప్పుకున్నాను. కానీ నేను వెళ్లను అంటుంది జ్యోత్స్న. నువ్వు సీఈఓగా పనికిరావు అనడానికి ఇది మంచి ఉదాహరణ. నీకు లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు లేవు అన్నట్లు మాట్లాడుతాడు శివన్నారాయణ. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అని జ్యోత్స్నకు చిన్న వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు శివన్నారాయణ.

66
మనం రోడ్డున పడతాం..

మీ తాత కోపం చూశావు కదా.. ఎలాగైనా వెళ్లవే.. లేదంటే దీప సీఈఓ అయిపోతుంది. ఆస్తి కార్తీక్ గాడి పేరు మీద రాస్తారు. నీ గురించి నిజం తెలిస్తే మనం రోడ్డున పడతాం అంటుంది పారు. కోపంగా చూస్తుంది జ్యోత్స్న. ఎందుకు అలా కోపంగా చూస్తున్నావ్ అంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories