అఖండ 2 లో బాలయ్య కంటే 48 ఏళ్లు చిన్న నటి ఎవరో తెలుసా? ఐదుగురు హీరోయిన్ల ఏజ్ గ్యాప్ ఎంత?

Published : Dec 13, 2025, 05:41 PM IST

నందమూరి బాలకృష్ణ సినిమా 'అఖండ 2: తాండవం' బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీమియర్‌తో కలిపి తొలిరోజే ఈ సినిమా రూ.30.53 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో 5 మంది హీరోయిన్లు నటించారు. అయితే ఈ హీరోయిన్లు బాలయ్య కంటే ఎంత చిన్నవారో తెలుసా? 

PREV
16
బాక్సాఫీసు వద్ద అఖండ తాండవం

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, బోయపాటి డైెరెక్షన్ లో నటించిన సినిమా అఖండ 2. ఎన్నో అవాంతరాల తరువాత  ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.  ఈ  సినిమాకు కొన్చిని చోట్ల  మిశ్రమ స్పందన లభిస్తోంది. బాలయ్య అభిమానులు మాత్రం పూనకాలతో ఊగిపోతున్నారు. కాగా బాక్సాఫీస్ దగ్గర అఖండ2  ఫస్ట్ డే 36 కోట్ల వరకూ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కనిపించగా.. బాలయ్యకు ఆ హీరోయిన్లకు మధ్య ఏజ్ గ్యాప్ పై వార్తలు వైరల్ అవుతున్నాయి. 

26
1. సంయుక్త మీనన్

వయసు : 30 ఏళ్లు

'అఖండ 2: తాండవం'లో సంయుక్త మీనన్ మెయిన్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో  వైరస్‌ను నాశనం చేసే యాంటీడోట్‌ను తయారుచేసే ల్యాబ్ హెడ్ అర్చనా గోస్వామి పాత్రను సంయుక్త మీనన్ పోషించారు. 65 ఏళ్ల బాలకృష్ణ కంటే ఆమె 35 ఏళ్లు చిన్నది.

36
2. హర్షాలీ మల్హోత్రా

వయసు : 17 ఏళ్లు

'అఖండ 2: తాండవం'లో హర్షాలీ మల్హోత్రా DRDO సైంటిస్ట్ అయిన డా. జనని పాత్రలో నటించింది. ఆమె మురళీ కృష్ణ (బాలకృష్ణ) కూతురిగా కనిపించింది. ఆమె NBK కంటే 48 ఏళ్లు చిన్నది.

46
3. పూర్ణ ఖాసిం

వయసు : దాదాపు 36 ఏళ్లు

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన పూర్ణ కూడా ఈ మూవీలో నటించింది.  బాలకృష్ణ కంటే 29 ఏళ్లు చిన్నదైన పూర్ణ ఖాసిం, 'అఖండ 2'లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐఏఎస్ పద్మావతి పాత్రను పోషించింది.

56
5. ప్రగ్యా జైస్వాల్

వయసు : 34 ఏళ్లు

బాలకృష్ణ కంటే 31 ఏళ్లు చిన్నదైన ప్రగ్యా, మురళీ కృష్ణ భార్య ఐఏఎస్ శరణ్య బచ్చుపల్లిగా నటించింది. కానీ, ఈసినిమాలో  ఆమె ఫోటో మాత్రమే వాడారు. మొదటి భాగం ‘అఖండ’లో ఆమె లీడ్ హీరోయిన్ గా నటించింది. 

66
4. వీజీ చంద్రశేఖర్

వయసు : దాదాపు 59 ఏళ్లు

'అఖండ 2: తాండవం'లో వీజీ చంద్రశేఖర్, అఖండ, మురళి (బాలకృష్ణ) తల్లి ధరణి పాత్రలో నటించారు. విశేషమేమిటంటే, ఆమె బాలయ్య కంటే 6 ఏళ్లు చిన్నది.

Read more Photos on
click me!

Recommended Stories