Demon Pavan: రీతూ కంటే వాళ్లిద్దరూ హౌస్ లో ఉండడమే పవన్ కి ఇష్టమా.. తనూజపై నమ్మకం లేదంటూ..

Published : Dec 13, 2025, 04:51 PM IST

రీతూ చౌదరి లేకపోవడంతో ఈ వారం చాలా బాగా ఎంజాయ్ చేశానని డిమాన్ పవన్ తెలిపారు. నాగార్జున అతడిపై వేసిన సెటైర్లు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9 షో చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. టాప్ 5, విన్నర్ విషయంలో ఆడియన్స్ నుంచి కొన్ని అంచనాలు వినిపిస్తున్నాయి. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ లలో ఒకరు టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. వీకెండ్ ప్రారంభం కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

25
రీతూ చౌదరి లేకుంటేనే బావుంది

శనివారం కావడంతో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. డిమాన్ పవన్ పై నాగార్జున సెటైర్లు వేస్తున్నారు. హౌస్ లో రీతూ చౌదరి లేకపోయే సరికి పవన్ అందరిని బాగా కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని అన్నారు. నిజంగానే రీతూ లేకుండా ఈ వారం చాలా బావుంది. బాగా ఎంజాయ్ చేశా అని పవన్ చెప్పాడు. దీనితో నాగార్జున నవ్వేశారు.

35
వాళ్లిద్దరూ ఉంటే రచ్చ రంబోలా

వెంటనే సంజన స్పందిస్తూ.. అయేషా, రమ్య హౌస్ లో ఉండిఉంటే ఇంకా బావుండేది అని కూడా పవన్ చెప్పాడు అని తెలిపింది. వాళ్లిద్దరూ ఉండిఉంటే రచ్చ రంబోలా అని చెప్పాడట.

45
నాగార్జున ఇచ్చిన టాస్క్

సరదా కామెంట్స్ ముగిసిన తర్వాత నాగార్జున ఇంటి సభ్యులకు ఓ టాస్క్ పెట్టారు. ఒక్కొక్కరు ఇంట్లో తమకి నమ్మకమైన వారు ఎవరు.. నమ్మకం లేని వారు ఎవరు అనేది చెప్పాలని అడిగారు. నమ్మకం ఉన్నవాళ్లకు గ్రీన్ ఫ్లాగ్, నమ్మకం లేనివాళ్లకు రెడ్ ఫ్లాగ్ ఇవ్వాలి.

55
తనూజపై నమ్మకం లేదు

ముందుగా సంజన.. ఇమ్మాన్యుయేల్ కి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చింది. తనకి ఇమ్మాన్యుయేల్ అంటే నమ్మకం అని చెప్పింది. రెడ్ ఫ్లాగ్ ని తనూజకి ఇస్తూ.. హౌస్ లో తాను తనూజని ఎప్పటికీ నమ్మలేను అని సంచలన వ్యాఖ్యలు చేసింది. తనూజతో నాకు బాండింగ్ అంతగా లేదు. ఈ వారం విభేదాలు మరింత పెరిగాయి అని సంజన పేర్కొంది. భరణి మాట్లాడుతూ తనకి హౌస్ లో నమ్మకస్తుడు సుమన్ శెట్టి అని, డిమాన్ పవన్ పై నమ్మకం లేదు అని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories