Nana Patekar Net Worth: రూ. 35 నుంచి కోట్ల ఆస్తుల వరకు.. నానా పటేకర్ రియల్ లైఫ్ అండ్ నెట్ వర్త్ డిటైల్స్

Published : Oct 08, 2026, 09:46 AM IST

Nana Patekar Net Worth: కేవలం 35 రూపాయలతో కెరీర్ ప్రారంభం నుంచి రూ. 80 కోట్ల ఆస్తుల వరకు పెరిగిన బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన సినిమా కెరీర్, ఆస్తుల వివరాలు ఇవే.

PREV
15
గుండెపోటుతో నానా పటేకర్ కన్నుమూత: ఎన్ని కోట్ల ఆస్తులు వదిలి వెళ్లారో తెలుసా?

ప్రముఖ నటుడు నానా పటేకర్ (75) మంగళవారం ఉదయం కన్నుమూశారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న ఆయన నివాసంలో ఉదయం 5:20 గంటల ప్రాంతంలో గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యుల బృందం దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ అందించి ఆయనను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

మణిపాల్ ఆసుపత్రి అంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనపై మెడికో-లీగల్ కేస్ నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఆయన మృతితో సినిమా రంగానికి చెందిన ప్రముఖులు, కోట్ల మంది అభిమానులు తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

25
13 ఏళ్ల వయసులో రూ. 35 సంపాదనతో మొదలైన జర్నీ

నానా పటేకర్ కెరీర్ ప్రారంభం అంత సులభంగా ఏమీ సాగలేదు. చిన్నతనంలోనే ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం 13 ఏళ్ల పసి వయసులోనే కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు పని చేయడం మొదలుపెట్టారు. ముంబైలోని చునాభట్టి ప్రాంతానికి ప్రతిరోజూ దాదాపు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. అక్కడ సినిమాల పోస్టర్లకు రంగులు వేసే పని చేసేవారు. ఆ రోజుల్లో ఆయన నెల సంపాదన కేవలం రూ. 35 కాగా, దానితో పాటు ఒక పూట భోజనం లభించేది. "డబ్బులు లేకపోతే సమాజం నిన్ను ఒక భారంగా చూస్తుంది" అని 1998లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నానా పటేకర్ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో పడ్డ కష్టమే ఆయనను నటుడిగా మరింత బలంగా మార్చింది.

35
నాటకాల నుంచి వెండితెరకు: అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా..

నాటక రంగం ద్వారా నటనా ప్రయాణం ప్రారంభించిన నానా పటేకర్ 'గమన్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'అంకుశ్', 'పరిందా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 'క్రాంతివీర్' సినిమాలో ఆయన చూపించిన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ ఫిల్మ్ అవార్డు లభించింది.

అలాగే 'అగ్నిసాక్షి', 'ఖామోషి', 'అబ్ తక్ ఛప్పన్', 'వెల్కమ్' వంటి చిత్రాలతో విలక్షణ నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1990ల నాటికి ఆయన డిమాండ్ విపరీతంగా పెరిగింది. 'అగ్నిసాక్షి' విజయం తర్వాత ఆయన ఒక సినిమాకు రూ. 1.25 కోట్ల పారితోషికం తీసుకునేవారు. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ తర్వాత అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా నానా పటేకర్ నిలిచారు.

45
రూ. 80 కోట్ల ఆస్తులు.. కానీ జీవనం మాత్రం అతి సాధారణం

ఇటీవలి రిపోర్టుల ప్రకారం నానా పటేకర్ నికర ఆస్తి విలువ దాదాపు రూ. 80 కోట్లుగా అంచనా వేశారు. ఆ తర్వాత రోజుల్లో ఆయన ఒక సినిమాకు రూ. 2 నుంచి రూ. 3 కోట్ల వరకు ఫీజు తీసుకునేవారని, కొన్ని సినిమాలకు లాభాల్లో వాటా కూడా తీసుకునేవారని సమాచారం. అయితే కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన జీవన శైలి మాత్రం చాలా సాధారణంగా ఉండేది.

ముంబైలోని అంధేరీ ప్రాంతంలో ఆయనకు 750 చదరపు అడుగుల ఫ్లాట్ ఉంది. దీని ప్రస్తుత విలువ రూ. 3 కోట్లుగా అంచనా. దీంతో పాటు పూణే సమీపంలోని ఖడక్వాస్లాలో 27 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. అక్కడ ఆయన వ్యవసాయం చేసేవారు. అలాగే మహీంద్రా జీప్, ఆడి Q5/Q7, బిఎమ్‌డబ్ల్యూ X6 వంటి లగ్జరీ కార్లు కూడా ఆయన గ్యారేజీలో ఉన్నాయి.

55
నామ్ ఫౌండేషన్ ద్వారా సహాయం

నానా పటేకర్ కేవలం నటుడిగానే కాకుండా గొప్ప మనసున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. తన సంపాదనలో చాలా భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేశారు. మహారాష్ట్రలో కరవు, రైతుల ఆత్మహత్యల నివారణ కోసం 2015లో ప్రముఖ నటుడు మకరంద్ అనాస్పూర్ తో కలిసి 'నామ్ ఫౌండేషన్' (NAAM Foundation) ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా నీటి నిల్వ ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు.

ఒకానొక సమయంలో రూ. 1.5 కోట్ల విలువైన లగ్జరీ కారు కొనడానికి బదులుగా, ఆ డబ్బును బాధితులైన రైతు కుటుంబాలకు పంచారని రచయిత రణబీర్ పుష్ప్ గుర్తు చేసుకున్నారు. అలాగే 'పాఠశాల' సినిమాకు పారితోషికం తీసుకోకుండా, ఆ మొత్తం చెక్కులను స్వచ్ఛంద సంస్థల పేరిట రాయించారు. రూ. 35 సంపాదనతో మొదలైన ఆయన ప్రయాణం కోట్ల రూపాయల ఆస్తుల వరకు సాగినా, ఆయన చేసిన సేవా కార్యక్రమాలే ఆయనను ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపివుంచుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories