మహేష్ బాబు తన జీవితంలో అస్సలు ముట్టుకోని ఆహారం ఏంటో తెలుసా? వాటిని ఎందుకు పూర్తిగా దూరంగా పెడతారో తెలుసా? ఆ ఫుడ్ మరేదో కాదు డైరీ ప్రొడక్ట్స్.. అంటే పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, నెయ్యి.. ఇలాంటివి ఆయన జీవితంలో ముట్టుకోరట. వీటితో పాటు ‘ప్రాసెస్డ్ షుగర్’ (Processed Sugar) లేదా రిఫైన్డ్ చక్కెర, ‘జంక్ / జున్ను-నూనెతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్’ ను దూరంగా ఉంచుతారు. అయితే ఆయన ఏం తింటారు అంటే.. అందరూ తినే ఫుడ్ తింటారు కానీ దానికి ఓ పద్ధతిని పాటిస్తుంటారు.
మహేష్ బాబు చెప్పిన వివరాల ప్రకారం, ఆయన స్వీట్స్, రిఫైన్డ్ షుగర్‌తో చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్స్, డీప్ ఫ్రై చేసిన నూనె పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. అందరిలా ఇడ్లీలు, పూరీలు, బోండాలు.. సాంబారన్నం.. బిర్యానీలు తింటారు. కానీ వాటిని చాలా మితంగా తీసుకుంటారు మహేష్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. "నేను అన్నిరకాల ఫుడ్స్‌ను టేస్ట్ చేస్తాను.. కానీ చాలా మితంగా తింటాను.. పూరీ ఇష్టం కదా అని పది, ఇరవై తినేయను.. రెండు మూడు తింటే చాలు."