Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు

Published : Oct 08, 2026, 08:43 AM IST

విలక్షణ నటుడు నానా పటేకర్‌ కన్నుమూశారు. ఆయన నటనని ఆవిష్కరించిన టాప్‌ 10 సినిమాలేంటో చూద్దాం. తప్పక చూడాల్సిన చిత్రాలివి. ఇవి చూస్తే నానా పటేకర్‌ ఏంటో అర్థమవుతుంది.

PREV
18
నానా పటేకర్‌ నటనని ఆవిష్కరించే టాప్‌ 10 మూవీస్‌

భారతీయ సినీ పరిశ్రమలో సహజమైన, తీవ్రతతో కూడిన నటనకు నానా పటేకర్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌, హీరో, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కామెడీ పాత్ర.. ఏ పాత్రలో కనిపించినా తనదైన బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1978లో `గమన్‌`తో సినీ ప్రయాణం ప్రారంభించిన ఆయనకు ‘పరిందా’, ‘క్రాంతివీర్‌’ వంటి సినిమాలు నటుడిగా భారీ గుర్తింపును తీసుకొచ్చాయి. నానా పటేకర్‌ నటనా ప్రతిభను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే తప్పక చూడాల్సిన టాప్‌ 10 సినిమాలు ఇవే..

28
1. పరిందా – 1989

విధు వినోద్‌ చోప్రా దర్శకత్వం వహించిన ఈ క్రైమ్‌ డ్రామాలో నానా పటేకర్‌ అన్నా అనే గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఈ పాత్రలోని క్రూరత్వం, సైలెంట్‌ ఇంటెన్సిటీ ఆయన నటనలో మరో కోణాన్ని చూపించింది. ఈ చిత్రానికి ఆయనకు జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా లభించింది.

38
2. క్రాంతివీర్‌ – 1994

మెహుల్‌ కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నానా పటేకర్‌ పోషించిన ప్రతాప్‌ నారాయణ్‌ తిలక్‌ పాత్ర ఆయన కెరీర్‌లోనే అత్యంత గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటి. ఆవేశం, దేశభక్తి, సామాజిక ఆలోచనలను తన డైలాగ్‌ డెలివరీతో ప్రేక్షకులకు చేరువ చేశారు. ఈ నటనకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు.

48
3. అగ్ని సాక్షి – 1996

మనీషా కొయిరాలాతో కలిసి నటించిన ఈ థ్రిల్లర్‌లో నానా పటేకర్‌ భయానకమైన, మానసికంగా సంక్లిష్టమైన పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలోని నటనకు ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డు అందుకున్నారు.

4. ప్రహార్‌ – ది ఫైనల్‌ అటాక్‌ – 1991

నానా పటేకర్‌ నటుడిగానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్‌ప్లే, డైలాగ్‌ రైటర్‌గా కూడా పనిచేసిన చిత్రం ఇది. ఇందులో ఆయన పోషించిన మేజర్‌ చౌహాన్‌ పాత్ర ద్వారా సైనిక జీవితంలోని క్రమశిక్షణ, భావోద్వేగాలను బలంగా చూపించారు.

58
5. నటసమ్రాట్‌ – 2016

మరాఠీ రంగస్థల నటుడి జీవితాన్ని ఆధారంగా చేసుకున్న ఈ సినిమాలో నానా పటేకర్‌ గణపత్‌ బెల్వాల్కర్‌గా నటించారు. వృద్ధాప్యం, కుటుంబం, ఒంటరితనం, గౌరవం వంటి భావోద్వేగాలను ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాత్రకు ఫిల్మ్‌ఫేర్‌ మరాఠీ ఉత్తమ నటుడి అవార్డు కూడా దక్కింది.

68
6. అబ్‌ తక్‌ ఛప్పన్‌ – 2004

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ సాధు ఆగాషే పాత్రలో నానా పటేకర్‌ చూపించిన నటన ఈ సినిమాకు ప్రధాన బలం. పోలీస్‌ ఆఫీసర్‌గా ఉండే ఒత్తిడి, వ్యక్తిగత కసి, నైతిక సంఘర్షణలను ఆయన చాలా సహజంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయనకు ఉత్తమ నటుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

7. అపహరణ్‌ – 2005

రాజకీయాలు, కిడ్నాప్‌ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నానా పటేకర్‌ తబ్రేజ్‌ ఆలమ్‌గా కనిపించారు. రాజకీయ నాయకుడిగా ఆయన చూపించిన చల్లని, లెక్కలు వేసే నటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్రకు ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ విలన్‌ అవార్డు అందుకున్నారు.

8. సలామ్‌ బాంబే! – 1988

మీరా నాయర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానా పటేకర్‌ పోషించిన పాత్ర ఆయన కెరీర్‌ ప్రారంభ దశలోనే నటుడిగా ఉన్న సామర్థ్యాన్ని చూపించింది. ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా ప్రశంసలు అందుకుంది.

78
9. వెల్‌కమ్‌ – 2007

ఇంతవరకు సీరియస్‌, విలన్‌, భావోద్వేగ పాత్రల్లో మెప్పించిన నానా పటేకర్‌.. ఉదయ్‌ శెట్టి పాత్రతో కామెడీలోనూ తన టైమింగ్‌ ఏంటో నిరూపించారు. ఆయన డైలాగ్‌ డెలివరీ, అనిల్‌ కపూర్‌తో కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

88
10. రాజ్‌నీతి – 2010

ప్రకాశ్‌ ఝా దర్శకత్వంలో వచ్చిన ఈ పొలిటికల్‌ డ్రామాలో నానా పటేకర్‌ బ్రిజ్‌ గోపాల్‌గా నటించారు. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలు, భావోద్వేగాలను కలగలిపిన ఈ పాత్రలో ఆయన మరోసారి తన నటనా పరిధిని చాటుకున్నారు.

మొత్తంగా చూస్తే.. నానా పటేకర్‌ నటనా ప్రయాణంలో ‘పరిందా’ నుంచి ‘నటసమ్రాట్‌’ వరకు ప్రతి దశలోనూ భిన్నమైన పాత్రలు కనిపిస్తాయి. గంభీరమైన పాత్రలే కాకుండా ‘వెల్‌కమ్‌’లాంటి కామెడీ పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించడం ఆయన బహుముఖ నటనా ప్రతిభకు నిదర్శనం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories