టాలీవుడ్ మన్మధుడు నాగార్జున
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు ఫిల్మ్ ఇండస్ట్రీలో మన్మధుడు అన్న పేరు ఉంది. లేడీ ఫాలోయింగ్ అత్యధికంగా ఉన్న హీరోలలో నాగార్జున ముందుంటారు. ఇప్పటికీ 65 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఫిట్ నెస్ ను , గ్లామర్ ను లేడీ ఫాలోయింగ్ ను మెయింటేన్ చేస్తున్నాడు నాగార్జున. కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీ స్టార్లు కూడా నాగార్జునతో ప్రేమలో పడిపోతుంటారు. 65 ఏళ్ల వయసులో కూడా నాగార్జున ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. తన కొడుకులు ఇద్దరు హీరోలుగా పరిచయం అయ్యి చాలా కాలం అవుతున్నా.. నాగార్జున మాత్రం వారికి మించి రొమాంటిక్ ఇమేజ్ ను కొనసాగిస్తున్నారు.