sridevi
తెలుగు లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని దశాబ్దాలు కష్టపడి దేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. తన తర్వాత తన వారసులు నటులు కావాలని ఏఎన్నార్ కోరుకునేవారట. కానీ నాగార్జునని ఎప్పుడూ బలవంతం చేయలేదు. నాగార్జున చదువులు పూర్తి చేసుకుని ఫారెన్ నుంచి తిరిగివచ్చారు.
శ్రీదేవితో కలసి నటించిన ఆఖరి పోరాటం చిత్రం పెద్ద హిట్ అయింది. ఒక్కరు కూడా నా గురించి మాట్లాడక పోగా తిరిగి అవమానకరమైన కామెంట్స్ వినిపించాయి. అందులో నాగార్జునది ఏమి లేదు.. అది శ్రీదేవి క్రేజ్.. ఆమె సినిమా అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారట. ఇది ఆఖరి పోరాటం కాదు శ్రీదేవి పోరాటం అని అన్నారట. అంతకు ముందు నటించిన చిత్రాల్లో కూడా హీరోయిన్లకు పేరు వచ్చింది కానీ తనకి ఎలాంటి గుర్తింపు రాలేదని నాగార్జున బాధపడ్డారు. ఇకనైనా నా పంథా మార్చుకోవాలి అని నాగ్ డిసైడ్ అయ్యారట.
తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు చేయాలని కసితో ప్రయత్నాలు మొదలు పెట్టారు. అప్పడే నాగార్జున మణిరత్నం గురించి విన్నారు. ఎలాగైనా ఆయనతో సినిమా చేయాలని చెన్నై వెళ్లారట. పోయెస్ గార్డెన్ లో జయలలిత ఇంటి పక్కనే మణిరత్నం ఇల్లు. ఆయన్ని వెళ్లి కలసి మీతో సినిమా చేయాలి అని అడిగా. నాకు కుదరదు.. నేను తెలుగు సినిమాలు చేయలేను అని అన్నారు.
నేను వదల్లేదు. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు ఆయన ఇంటి గేటు దగ్గర ఎదురుచూసేవాడిని. ఆ టైంకి ఆయన మార్నింగ్ వాక్ కి వెళ్లేవారు. పది రోజులు కనిపిస్తూనే ఉన్నా. నా డెడికేషన్ ఆయనకి నచ్చింది. ఒకే నీతో సినిమా చేస్తా. నెల తర్వాత నిన్ను కలుస్తా అని చెప్పారు. అప్పుడే గీతాంజలి కథ వినిపించారు. సరిగ్గా 32 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అని నాగార్జున తెలిపారు. నా నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శివ చిత్రం.. ఆ మూవీ చేసిన సంచలనం ఏంటో అందరికి తెలుసు.