టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తారక్.. ఆస్కార్ రేంజ్ కు దూసుకువెళ్ళాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న దేవర సినిమా ఫైనల్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఈసినిమా నుంచి వచ్చిన సాంగ్ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇక సాంగ్ అంటే గుర్తుకు వచ్చింది. ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ అని అందరికి తెలిసిందే. ఆయన హీరోగా.. డాన్సర్ గా సింగర్ గా కూడా అందరికి తెలుసు. తన సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు ఎన్టీఆర్.. దాదాపు అరడజను పాటల వరకూ తారక్ ఆలపించాడు. ఇంతకీ ఆ పాటటేంటో ఓలుక్కేద్దామా..?
యాక్టింగ్ తో పాటు డైలాగ్ డెలివరీలో కుమ్మేస్తాడు ఎన్టీఆర్. ఇక తాను పాటగాడిని కూడా అని నిరూపించుకున్నాడు. ఆయన పాడిన పాటలు అన్ని హిట్ అయ్యాయి. సినిమా డిజాస్టర్ అయినా.. ఎన్టీఆర్ పాటలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక తారక్ పాటల విషయానికి వస్తే.. చివరిగా ఆయన నాన్నకు ప్రేమతో సినిమాలో ఐ వాన ఫాలో ఫాలో యూ.. సాంగ్ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్ చేసిన ఈ పాట మామూలు హిట్ అవ్వలేదు. ఇప్పటికి తారక్ ఫ్యాన్స్ ను అలరిస్తూనే ఉంది.
క్లాస్ మాస్ ట్యూన్స్ అన్నీటచ్ చేశాడు ఎన్టీఆర్.. ప్లాప్ అయిన సినిమాల్లో కూడా హిట్ సాంగ్స్ పాడాడు.. ఆయన రభస సినిమాలో రాకాసి రాకాసి నను రబ్బరు బంతిలా ఎగరేసి అనే పాటతో మరోసారి సింగర్ గా అదరగొట్టారు. ఈపాటికి తమన్ సంగీతం అందించగా.. సినిమా ప్లాప్ అయిన.. పాట్ మాత్రం మోగుతూనే ఉంది. అలాగే సూపర్ హిట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్న అదుర్స్ లో కూడా ఎన్టీఆర్ పాటపాడారు. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో . వేర్ ఇస్ ది పంచికట్టు అనే పాటకు మరోసారి ఎన్టీఆర్ తన గాత్రం అందించారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
ఇక ఎన్టీఆర్ లో గాత్ర పటిమను గుర్తించి.. అద్భుతమైన పాటలు పాడగలరు అని ప్రోత్సహించిన వారిలో కీరవాణి ఒకరు. రాజమౌళి డైరెక్షన్ లో యమదొంగ సినిమా వీరి కాంబోలో వచ్చింది. అయితే ఆసినిమాలో పాటను ఎన్టీఆర్ తో పట్టుపట్టి పాడించారట కీరవాణి. ఆ సాంగ్ ఏదో కాదు..ఓ లమ్మి తిక్క రేగిందా సాంగ్. అది అప్పట్లో ఊపు ఊపేసింది. ఇక తారక్ తో ఎక్కువ పాటలు పాడించిన వారిలో మణిశర్మ కూడా ఉన్నారు. ఆయన మ్యూజిక్ అందించిన కంత్రి సినిమాలో వన్ టూ త్రీ నేనొక కంత్రి పాటతో ఎన్టీఆర్ అలరించారు. ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా డిజాస్టర్ అయింది.
తెలుగులోనే కాదు కన్నడలోనూ ఎన్టీఆర్ ఒక పాట పాడారు. పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన చక్ర వ్యూహ సినిమాలో గెలయా గెలియా అనే సాంగ్ పాడారు. ఈ సాంగ్‌కు థమన్ సంగీతం అందించారు. అలా ఎన్టీఆర్ పాటలు పాడిన ఈ సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తారక్ ను ఆదర్శంగా తీసుకుని.. మరికొంత మంది హీరోలు కూడా తమ సినిమాల్లో పాటలు పాడటం స్టార్ట్ చేశారు.