నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే, అక్కినేని ప్యామిలీ అంతటికి ఇష్టమైన ఐటమ్ ఏంటో తెలుసా..?

కింగ్ నాగార్జున రోజు రాత్రి మిస్ అవ్వకుండా ఓ ఐటమ్ పక్కాగా తింటారట. ఆ ఐటమ్ తినకుండా నాగార్జున అస్సలు నిద్రపోరట. రోజూ పక్కాగా  తినే ఆ ఐటమ్ ఏంటి..? నాగార్జున స్వయంగా వెల్లడించిన సీక్రెట్. 
 

టాలీవుడ్  సీనియర్ హీరోలలో కింగ్ నాగార్జున  కూడా ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమకు నాలుగు స్తంభాల్లా నిలిచిన వారిలో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా ఉన్నారు. టాలీవుడ్ లోని పెద్ద సినిమా ఫ్యామిలీలో నాగార్జున ప్యామిలీ కూడా ఒకటి. 

AlSo Read: మోక్షజ్ఞ కోసం మహేష్ బాబు హీరోయిన్

అక్కినేని వారసత్వాన్ని తీసుకుని.. ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందారు నాగార్జున. నాగేశ్వరావు లెగసీని కాపాడుతూ.. కంటీన్యూ చేశారు కింగ్. ఇక నాగార్జున తరువాత ఆయన వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన నాగచైతన్య, అఖిల్.. స్టార్లు గా మారలేకపోతున్నారు. హీరోలు గా తమనను తాము నిరూపించుకున్నా.. టైర్ 2 స్థాయి వరకే ఆగిపోయారు. 

ఎంత ప్రయత్నించినా.. ఈ ఇద్దరు వారసులను ఇండస్ట్రీలో ఓ స్థాయిలో నిలబెట్టలేకపోయారు నాగార్జున. చైతూ అంతో ఇంతో స్టార్ డమ్ సాధించాడు కాని.. అఖిల్ అయితే హీరోగా ఏమాత్రం నిలబడలేకపోతున్నాడు ఇప్పటికే ఆయన చేసిన సినిమాలన్నీటిలో సాలిడ్ హిట్ ఒక్కటి కూడా లేదు. ఒకటి రెండు యావరేజ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. 

AlSo Read:  ఇండస్ట్రీకి దూరంగా సంపూర్ణేష్ బాబు


అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున ఫ్యామిలీకి స్టూడియోలు ఉండటం, నిర్మాతలుగా  ఉండటం, పలు బిజినెస్ లలో కూడా వారు రాణిస్తుండటంతో..  టాలీవుడ్ లో తిరుగు లేని స్టార్ డమ్ ను వారు కొనసాగిస్తున్నారు. అదే ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని హీరోలు అయితే..  ఈ పాటికి ఇండస్ట్రీ నుంచి మాయం అయ్యేవారేమో. 

కాగా కింగ్ నాగార్జున ఫుడ్ హ్యాబిట్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో నాగార్జున నైట్ అస్సలు మిస్ అవ్వకుండా తినే ఓ ఫుడ్ ఐటమ్ గురించి ఓ వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. నాగార్జున నైట్ మిస్ అవ్వకుండా పక్కాగా ఐస్ క్రీమ్ తింటారట. అది తినకుండా ఆయన అస్సలు పడుకోరట.

AlSo Read:   ఎన్టీఆర్ ‌- పవన్ కళ్యాన్ తో మల్టీ స్టారర్

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆఞనే స్వయంగా వెల్లడించారు. నేను రోజు రాత్రం ఖచ్చితంగా ఐస్ క్రీమంత్ తింటాను.. అది తినకుండా నేను పడుకోను అన్నారు కింగ్. అంతే కాదు నాగార్జునతో పాటు.. వారి ఇంట్లో వారికి కూడా ఫెవరేట్ ఫుడ్ ఐటమ్ ఏంది అంటే ఐస్ క్రీమ్ అనే సమాధానం వస్తుంది. 

గతంలో హీరో శర్వానంద్ అఖిల్ తో పాటు అమలను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో మీకు ఫెవరేట్ ఫుడ్ ఏదీ అని అడిగితే.. అఖిల్ తో పాటు అమల కూడా ఐస్ క్రీమ్ అని చెప్పింది. దాంతో ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఐస్ క్రీమ్ లు తిని బ్రతికేస్తున్నారా అని శర్వానంద్ జోక్ చేశారు  కూడా. ఇలా నాగార్జున ఇంట్లో ఐస్ క్రీమ్ కు అంత ప్రత్యేకత ఉంది. 

AlSo Read:  నాగార్జున గారు సోనియా అంటే ఎందుకంత ప్రేమ

ఇక 65 ఏళ్ళ వయస్సులో కూడా దూసుకుపోతున్నారు నాగార్జున. అదే ఫిట్ నెస్ తో హ్యాండ్సమ్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ను హోస్ట్ చేస్తున్న కింగ్.. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ధనుష్ మూవీతో పాటు.. రజినీకాంత్ మూవీలో కూడా ఆయన నటిస్తున్నారు.   

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

Latest Videos

click me!