ఇందులో వీరి మధ్య ఆసక్తికర డిస్కషన్ జరిగింది. అన్ని భాషల్లో ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పినట్టుగా సిద్దు జొన్నలగడ్డ అడిగాడు. ఇక ముంబయికి షిఫ్ట్ అయిపో, అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడమేంటి అన్నా అని అడిగాడు, దానికి నీకు వచ్చుగా హిందీ బాగానే అంటే తనదైన కామెంట్‌తో నవ్వులు పూయించాడు సిద్దు.
విశ్వక్ సేన్ ఉండి.. ఎట్లుందన్నా రొమాన్స్ చేస్తుంటే `దేవర`లో అని అడిగాడు. మీరనుకున్న రొమాన్స్ ఉండదు అని చెప్పాడు తారక్. దానికి విశ్వక్ సేన్ `ఆ లెవల్‌లో రొమాన్స్ ఉండదు అంటుర్రు` అని సిద్దు వైపు చూపించాడు. దీనికి ఆ కరెక్ట్ కరెక్ట్ ఈ లెవల్ రొమాన్స్ ఉండదుగానీ అని సిద్దు వైపు చేయి చూపిస్తూ సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యాడు ఎన్టీఆర్.