ఈ సినిమా క్లైమాక్స్ లో అన్నమయ్య పండు ముసలి అవుతాడు. మోక్షం కోసం దేవునితో మాట్లాడే సీన్. చాలా లెన్తీ సీన్ అది. అయితే అంత సేపు నాగార్జున వాయిస్ వణుకుతూ, ముసలి వాయిస్ రావాలి. కాని అది హీరోకు సాధ్యం అవుతందో లేదో, అతన్ని ఇబ్బందిపెట్టడం ఎందుకు అని ఎస్పీ బాలుచేత ఈసీన్ కు డబ్బింగ్ చెప్పిద్దాం అనుకున్నాడట.
కానీ సినిమా అంతా తానే డబ్బింగ్ చెప్పి.. ఆ ఒక్క సీన్ కు వేరే వాళ్తతో చెప్పించడం ఎందుకు నేనే చెపుతాను అని నాగార్జున అన్నారట. అయితే ముసలి గొంతుతో మాట్లాడటం కింగ్ కు చాలా కష్టంగా అనిపించింది. అప్పటికి నాగార్జున 38 ఏళ్ల యంగ్ ఏజ్ లోనే ఉన్నారు. దాంతో ఈ పాత్రకు ఎలాగైనా డబ్బింగ్ చెప్పాలని, డబ్బింగ్ ముందు రోజు రాత్రి దాదాపు 1 కిలో వరకూ ఐస్ క్యూబ్స్ తినేశాడట.