ఇటీవలే పూరీ జగన్నాథ్ హీరోగా నాగార్జునకి లైన్ నెరేట్ చేశాడట. దానికి నాగ్ బాగా ఇంప్రెస్ అయ్యారట. చాలా రోజుల తర్వాత ఈ లైన్‌కి ఆయన బాగా ఎగ్జైట్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి. అన్నీ ఓకే అనుకుంటే త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉందని, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలి, అది నాగ్‌కి నచ్చాలి? ఆ తర్వాత సినిమా ప్రకటన చేయాల్సి ఉంది. దీనికి కాస్త సమయం పట్టే ఛాన్స్ ఉంది. కానీ సెట్ అయితే మాత్రం 20 ఏళ్ల తర్వాత ఈ కాంబినేషన్ సెట్ కాబోతుందని చెప్పొచ్చు. ఇది అటు పూరీ, ఇటు నాగార్జున ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే వార్త అనే చెప్పాలి. ఏం జరుగుతుందో చూడాలి.