Nandamuri Balakrishna
బాలకృష్ణ తన ఐదు దశాబ్దాల కెరీర్‌లో 109 సినిమాలు చేశారు. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ నాలుగు సినిమాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు 3డ్రీ మూవీస్ సాధారణంగానే వస్తున్నాయి. కానీ ఏకంగా నలభై ఏళ్ల క్రితమే 3డీ సినిమాకి శ్రీకారం చుట్టారు బాలయ్య. కానీ ఆ మూవీ ఆగిపోయింది. అది ఎలా ఆగిపోయింది? ఇంతకి ఆ సినిమా ఏంటి? అనేది చూస్తే..
Nandamuri Balakrishna
బాలకృష్ణ ప్రారంభంలో చాలా సినిమాలు తండ్రి ఎన్టీఆర్‌తోనే కలిసి నటించారు. అటు సాంఘీకాలు, ఇటు పౌరాణికాలు, జానపదాలు ఇలా ఏవైనా బాలయ్య కేవలం తండ్రి సినిమాల్లోనే మెరిశారు. 12వ మూవీ నుంచి ఆయన సోలో హీరోగా మారారు. 1974లో `తాతమ్మకళ` చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమై, పదేళ్ల తర్వాత `సాహసమే జీవితం` మూవీతో సోలో హీరోగా పరిచయం అయ్యారు.
Nandamuri Balakrishna
అప్పట్లో `మంగమ్మ గారి మనవడు` చిత్రంలో బిగ్ బ్రేక్ అందుకున్నారు. 1985లో వచ్చిన `బాబాయ్ అబ్బాయి` చిత్రం బాలకృష్ణకి 20వ మూవీ కావడం విశేషం. ఈ మూవీని నిర్మించిన సుధాకర్‌రెడ్డి, ఎస్ గోపాల్ రెడ్డి కలిసి మరో సినిమాని ప్లాన్ చేశారు.
దాని పేరే `శపథమ్`. దీనికి క్రాంతికుమార్ దర్శకుడు. కథతోపాటు టీమ్ అంతా రెడీ అయ్యింది. సినిమాని అధికారికంగా ప్రకటించారు. త్వరలో ప్రారంభించాలని కూడా భావించారు. కానీ ఏం జరిగిందో ఏమో సినిమాని ఆదిలోనే ఆపేశారు.
Nandamuri Balakrishna
అయితే అప్పట్లో 3డీ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీని కూడా త్రీడీలోనే తెరకెక్కించాలని భావించారు. కానీ అనుకోకుండా ఈ మూవీ ఆగిపోయింది. దానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి వచ్చింది.
కానీ అదే ఏడాది బాలయ్య `భలేతమ్ముడు`, `కత్తుల కొండయ్య`, `పట్టాభిషేకం` వంటి మూవీస్ చేసినా పెద్దగా ఆడలేదు. 25వ మూవీ `నిప్పులాంటి మనిషి` ఫర్వాలేదనిపించుకుంది. అలా అప్పట్లో ఏడాది ఏడెనిమిది సినిమాలు చేసి మెప్పించారు బాలకృష్ణ. ఇప్పుడు ఏడాది ఒక్కో సినిమాతోనే వస్తున్నారు.