ఇప్పుడు మరోసారి ఆ విషయం బయటపడింది. బాలయ్యకి ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ పురస్కారం వచ్చిన వేళ ఈ విషయం బట్టబయలు అయ్యింది. ఎందుకంటే బాలకృష్ణకి ఇండస్ట్రీ నుంచి అందరు విషెస్ చెప్పారు. ఆయన సినిమా పరిశ్రమకి చేసిన సేవలకుగానూ, అలాగే ప్రజలకు ఎమ్మెల్యేగా అందిస్తున్న సేవలకుగానూ ఇది సరైన గుర్తింపుగా అభివర్ణించారు.
చిరంజీవి, వెంకటేష్, మోహన్‌బాబు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చరణ్, అల్లు అర్జున్, రవితేజ ఇలా పెద్ద హీరోల నుంచి, చిన్న హీరోల వరకు చాలా మంది విషెస్ చెప్పారు. హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు.