`గేమ్‌ ఛేంజర్‌`లో రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ కి ఫ్యాన్స్ ఫిదా అయిన సీన్లు ఏంటంటే? వైరల్‌

Published : Jan 26, 2025, 04:25 PM IST

రామ్‌ చరణ్‌ నటించిన `గేమ్‌ ఛేంజర్‌` మూవీ సంక్రాంతికి వచ్చి డిజప్పాయింట్‌ చేసింది. కానీ ఇందులోని కొన్ని సీన్లలో చరణ్‌ నటన విషయంలో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అవేంటనేది చూస్తే   

PREV
16
`గేమ్‌ ఛేంజర్‌`లో రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌ కి ఫ్యాన్స్ ఫిదా అయిన సీన్లు ఏంటంటే? వైరల్‌

రామ్‌ చరణ్‌ కి సంక్రాంతి సీజన్‌ కలిసి రావడం లేదు. అంతకు ముందు వచ్చిన `వినయ విధేయ రామ` సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు వచ్చిన `గేమ్‌ ఛేంజర్‌` నిరాశ పరిచింది. `గేమ్‌ ఛేంజర్` మూవీ కొందరు ట్రోలర్స్, మరికొందరు ఇతర హీరోల అభిమానుల వల్ల చంపబడిందని చెప్పొచ్చు. ఈ సినిమాపై నెగటివ్‌ ప్రచారం జరిగినంతగా మరే మూవీపై జరగలేదంటే అతిశయోక్తి కాదు.

26

`గేమ్‌ ఛేంజర్‌` సినిమాపై జరిగిన దాడి దాన్ని కోలుకోలేని దెబ్బతీసింది.పైగా బడ్జెట్‌ ఎక్కువగా ఉండటం కూడా మూవీకి పెద్ద నష్టం జరిగింది. సరైన ప్రమోషన్స్, ప్లానింగ్‌తో రిలీజ్‌ చేస్తే ఈ మూవీ బెటర్‌ రిజల్ట్ ని చవిచూసేది. మొత్తానికి `గేమ్‌ ఛేంజర్‌` ఫెయిల్యూర్‌ ఖాతాలోకి వెళ్లిపోయింది. అయినా ఇందులో కొన్ని బెస్ట్ సీన్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేసే సీన్లు, రామ్‌ చరణ్‌ నటన బెస్ట్ అనిపించే సీన్లు ఉన్నాయి. వాటిని అభిమానులు షేర్‌ చేస్తున్నారు. మరి అవేంటో చూస్తే.. 
 

36

సినిమాలో చరణ్‌ బెస్ట్ అనిపించుకున్న సీన్లలో రెండు ప్రధానంగా ఉన్నాయి. వాటిలో ఒకటి ఐఏఎస్‌ అధికారి కలెక్టర్‌గా విలన్‌(ఎస్‌ జే సూర్య)కి వార్నింగ్‌ ఇచ్చే సీన్‌. తనని వెయిట్‌ చేయించాడని మంత్రి అయిన సూర్య ఆవేశంతో లోపలికి వచ్చి తనకు నచ్చినట్టు చేయాలని చెబితే దాన్ని వ్యతిరేకిస్తాడు చరణ్‌. దీనికి ఆఫ్ట్రాల్‌ కలెక్టర్‌ వి అంటాడు సూర్య. ఈ క్రమంలో చరణ్‌ రెచ్చిపోతాడు.

46

కలెక్టర్‌ అంటే ఏంటో తెలుసా? అంటూ.. జిల్లా మొదటి పౌరుడు, జిల్లా మెజిస్ట్రేట్‌, జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్‌ ఎలక్షన్‌ ఆరో, జిల్లా అడ్మినిస్ట్రేటర్‌, జనాభా లెక్కల అధికారి, మున్సిపల్‌ సూపర్‌ వైజర్‌, ల్యాండ్‌ రికార్డ్స్, ల్యాండ్‌ రెవిన్యూ, ల్యాండ్‌ ఎంక్వైరింగ్‌, ఫార్మర్‌ లోన్‌, హోమ్‌ లోన్‌, ఓల్డేజ్‌ పెన్షన్‌ ఇలా అన్నింటికి అధికారి కలెక్టర్‌ అంటూ చెప్పే సమయంలో చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌, ఆయన హవాభావాలను ప్రశంసిస్తున్నారు ఫ్యాన్స్. 
 

56

అదే సమయంలో మినిస్టర్‌ అంటే ఎవరో తెలుసా అని సూర్య అడిగితే, అది కూడా మేమే రాసివ్వాలి.  మీకు రాజకీయం తెలుసు, మాకు రాజ్యాంగం తెలుసు. మీకు రిగ్గింగ్‌ తెలుసు. మాకు రూలింగ్‌ తెలుసు. మీకు జీవోలు పాస్‌ చేయడం తెలుసు, మాకు ఆ జీవోలు క్రియేట్‌ చేయడం తెలుసు. డబ్బుతో గెలిచి నువ్వు వచ్చావ్‌, ఏ డబ్బుతో కొనలేని ఎడ్యూకేషన్‌తో నేను వచ్చాను.

కింద సంతకం మాత్రమే నీది, పైన కంటెంట్‌ మొత్తం మాది, మీ పక్కన ఐఏఎస్‌ లేకపోతే మీరు జీరో. మీ పక్కన ఉంటూ మీకు విలువనిచ్చే నెంబర్‌ వన్‌ ఐఏఎస్‌. నువ్వు ఐదు సంవత్సరాలే మినిస్టర్‌, నేను చనిపోయేంత వరకు ఐఏఎస్‌` అనే సీన్‌ బాగా ట్రెండ్‌ అవుతుంది. ఇందులో చిరంజీవిని గుర్తు చేసేలా చరణ్‌ నటించాడని అంటున్నారు. 
 

66

దీంతోపాటు ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌లో అప్పన్న పాత్రపై దాడి జరిగినప్పుడు వారిని కొట్టి, అక్కడి టెలిఫోన్‌ బూత్‌ నుంచి ఫోన్‌ చేసే సీన్‌లో ఏడుస్తున్న రామ్‌ చరణ్‌ ఎక్స్ ప్రెషన్స్, ఆయన నటన అదిరిపోయిందంటూ ఆయా సీన్లని షేర్‌ చేస్తున్నారు. ఆ సీన్‌ని `రంగస్థలం`లోని అన్నయ్య పాత్ర చనిపోయినప్పుడు చరణ్‌ ఏడిచిన సన్నివేశంతో పోల్చుతూ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇవి బెస్ట్ సీన్స్ అని, అభినందించకుండా ఉండలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రధానంగా ఈ రెండు సీన్లు వైరల్‌ అవుతున్నాయి. రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి శంకర్‌ దర్శకుడు. దిల్‌ రాజు నిర్మించారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఇందులో చరణ్‌ ద్విపాత్రాభినయం చేశారు. జనవరి 10న ఈమూవీ విడుదలైన విషయం తెలిసిందే. 

read  more:మీ తమ్ముడి వల్ల ఇబ్బంది పడ్డా, ఆ మూవీ మీరు చేయొద్దు.. చిరంజీవిని ముందుగానే హెచ్చరించిన డైరెక్టర్

also read: వెంకటేష్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. సంచలన దర్శకుడు ప్లానింగ్‌?
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories