అఖిల్‌ కి మాత్రం పద్ధతులు నేర్పించి నాగార్జున చేసిన పని ఇదేనా? ఆయనకు లేని రూల్స్ కొడుక్కేందుకు ?

First Published | Nov 11, 2024, 5:34 PM IST

నాగార్జున చిన్నప్పుడు చేయాల్సిన అన్ని కొంటె పనులు చేశాడట. కానీ పెద్దయ్యాక మాత్రం కొడకు అఖిల్‌కి పద్దతులు నేర్పించాడట. ఎందుకో తెలుసా?
 

కింగ్‌ నాగార్జున టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరు. ఇంకా చెప్పాలంటే `ఆ నలుగురి`లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. విమర్శలు ఫేస్‌ చేసే స్థాయి నుంచి ది బెస్ట్ గా తనని తాను మలుచుకున్నాడు. తండ్రి ఏఎన్నార్‌కి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇంకా చెప్పొలంటే చాలా విషయాల్లో తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. తెలుగు ఆడియెన్స్ కి మాత్రం ఇప్పటికీ మన్మథుడిగానే నిలిచారు నాగ్‌. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

నాగార్జున ఇండస్ట్రీలో వివాదరహితుడిగా ఉన్నారు. ప్రాపర్టీస్‌, లీజుకి సంబంధించిన వ్యవహారాలు మినహాయిస్తే ఆయన చిత్ర పరిశ్రమకి సంబంధించి ప్రైవేట్‌ పర్సన్‌గా ఉంటారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చరు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తారు. సినిమాలు, వ్యాపారాలు చూసుకుంటారు. అయితే చిన్నప్పుడు మాత్రం నాగ్‌లో మరో కోణం ఉంది. మరో యాంగిల్‌ చూపించాడు.

తన ఇంట్లో ఆయనే పెద్ద అల్లరి అట. ఏఎన్నార్‌, అన్నపూర్ణమ్మలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. నాగార్జున చిన్నవాడు. చిన్న అన్నట్టే కాదు, అల్లరివాడు కూడా నట. చిన్నప్పుడు బాగా అల్లరి పనులు చేసేవాడట. కొంటె పనులు చేసి ఇంట్లో దొరికిపోయేవాడట. దీంతో అన్న వెంకట్‌, అక్క సుశీలతో దెబ్బలు కూడా తినేవాడట. 


అయితే స్కూల్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితి ఫేస్‌ చేసేవాడట. నాగ్‌ చెన్నైలో చదువుకున్నాడు. ఆ సమయంలో తన క్లాస్‌లో తనే చిన్నగా ఉండేవాడట. హైట్‌ తక్కువగా ఉండటంతో మిగిలిన స్టూడెంట్స్ తనని బాగా ఆటపట్టించేవాళ్లట, ఏదైనా అంటే కొట్టేవారట. అలా చాలా సార్లు దెబ్బలు తిన్నపరిస్థితి అని తెలిపారు నాగార్జున. అయితే అప్పుడు సోషల్‌ మీడియాలో లేదు.

దీంతో తాను ఎవరో ఎవరికీ తెలియదు, అందరి పిల్లల్లా తాను కూడా ఉండేవాడట. దీంతో హైయ్యర్‌ స్కూల్‌లో మాత్రం బాగా కొంటెపనులు చేసేవాడట. అంతేకాదు ఆ సమయంలో చేయాల్సిన అన్నిపనులు చేసినట్టు తెలిపారు. అప్పుడు పేరెంట్స్ కి తెలుస్తుంది, వాళ్లకి, వీళ్లకు తెలుస్తుందనే భయం లేదు, దీంతో విచ్చలవిడిగా ఉండేవాడినని, అన్ని అల్లరి పనులు చేసేవాడిని అని వెల్లడించారు నాగ్‌. చిన్నప్పుడు, టీనేజ్‌ లో చేయాల్సిన కొంటె పనులన్నీ తాను చేసినట్టు వెల్లడించారు. 
 

ఇప్పటిలా సోషల్‌ మీడియా, ఫోన్స్ లేకపోవడం వల్లే అలా ఉండగలిగాను అని తెలిపారు నాగార్జున. అయితే ఇన్ని కొంటె పనులు చేసిన నాగ్‌, కొడుకు అఖిల్‌ కి మాత్రం బుద్దులు నేర్పేవాడట. పద్ధతుల గురించి చెప్పేవాడట. ఇప్పుడు అందరి వద్ద ఫోన్స్ ఉన్నాయి. సోషల్‌ మీడియా బాగా విస్తరించింది. ఎవరు ఏం చేసినా తెలిసిపోతుంది. పెద్ద పెంట పెంట అవుతుంది.

ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే తాను అఖిల్‌కి ఇలాంటి పనులు చేయోద్దని, జాగ్రత్తగా ఉండాలని తరచూ చెబుతుండేవాడట. వాళ్లు కూడా పద్ధతిగానే ఉన్నారని తెలిపారు నాగ్‌. కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా ప్రోగ్రామ్‌లో నాగార్జున ఈ విషయాలను పంచుకున్నారు.
 

Nagarjuna

కానీ అఖిల్‌ ఇప్పటికే ఓ అమ్మాయిని ప్రేమించాడు. శ్రీయా భూపాల్‌ అనే డిజైనర్‌తో ఆయన ప్రేమలో పడ్డాడు. నాగార్జున వారికి ఎంగేజ్‌మెంట్‌ కూడా చేశాడు. కానీ అనుకోకుండా పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది. మ్యారేజ్‌ క్యాన్సిల్‌కి కారణాలు తెలియాల్సి ఉంది. అదే సమయంలో నాగచైతన్య, సమంత ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు.

చైతూ కి కూడా మొదట నాగార్జున ఇలాంటి లవ్‌ ట్రాక్‌లు వద్దు అన్నాడట. కానీ చైతూ వినలేదు. దీంతో సమంతతో పెళ్లి చేశారు. నాలుగేళ్లు కలసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. ఇప్పుడు చైతూ రెండో పెళ్లికి రెడీ అవుతున్నారు. మరో హీరోయిన్‌ శోభితా దూళిపాళని ఆయన డిసెంబర్‌లో మ్యారేజ్‌ చేసుకోబోతున్నారు. 
 

నాగార్జున ప్రస్తుతం సోలో హీరోగా మరే సినిమాని ప్రకటించలేదు. కానీ రెండు మల్టీస్టారర్లు చేస్తున్నారు. తమిళంలో రజనీకాంత్‌తో `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది ఇంపార్టెంట్‌ రోల్‌ అని తెలుస్తుంది. నెగటివ్‌ షేడ్‌లో ఉంటుందట. అలాగే ధనుష్‌తో `కుబేర` మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రిచ్‌మేన్‌గా కనిపించబోతున్నారు నాగ్‌. ఇందులోనూ ఆయనది చాలా ముఖ్యమైన పాత్ర అని తెలుస్తుంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. 
 

read more:ఫ్రెండ్‌ అన్ననే ప్రేమించిన తమన్నా, అతను చెప్పిన సమాధానంతో హార్ట్ బ్రేక్‌.. మిల్కీ బ్యూటీ ఫస్ట్ క్రష్‌

Latest Videos

click me!