బాలయ్య ముందు నోరు జారిన అల్లు అర్జున్, పుష్ప 2 రిలీజ్ టైమ్ లో రిస్క్ చేయొదంటున్న అభిమానులు

First Published | Nov 11, 2024, 5:02 PM IST

పుష్న2 రిలీజ్ కు దగ్గర పడుతుంది. ఈ టైమ్ లో ప్రమోషన్లు జాగ్రత్తగా చేయాలి అల్లు అర్జున్. కాని పొరపాటున నోరు జారి రిస్క్ చేయొద్దు అంటున్నారు అభిమానులు . తాజాగా అన్ స్టాపబుల్ లో అల్లుఅర్జున్ మాటలు వైరల్ అవుతున్నాయి. 

Allu Arjun

అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా యమా క్రేజ్ ఉంది. గతంలో తెలుగు జనాలతో పాటు మలయాళంలో కూడా బన్నీ అండు పడిచచ్చిపోయేవారు. కాని పుష్ప సినిమాతో అది పాన్ ఇండియాకు పాకింది. పాన్ ఇండియాలో ముఖ్యంగా యూపీ, బీహార్ లలో కూడా అల్లు అర్జున్ అంటే ప్రాణం పెట్టేస్తున్నారు అభిమానులు. ఈక్రమంలో పుష్ప2 ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి ఆస్కార్ టార్గెట్ గా, వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను కొల్లగొట్టే విధంగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈటైమ్ లోనే బన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

photo credit-aha unstoppable4 promo

సినిమా రిలీజ్ వరకూ రిస్క్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే  ఫ్యాన్స్ తో పాటు ప్రతీ హీరోకు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. సోషల్ మీడియా చాలా గట్టిగా ప్రభావ చూపిస్తున్న ఈటైమ్ లో యాంటీ ఫ్యాన్స్ చేసే ప్రచారం చాలా ఫాస్ట్ గా జనాల్లోకి వెళ్తుంది. సో అందుకే ప్రతీ అడుగు ఆచితూచి వేయాల్సి వస్తుంది. ఈక్రమంలోనే అల్లు అర్జున్ తాజాగా కాస్త నోరు జారి ఓ మాట అన్నట్టు తెలుస్తోంది. అది కూడా బాలయ్య ముందు.. అన్ స్టాపబుల్ షోలో బన్నీ ఈ టాక్ చేసినట్టు అంటున్నారు. 


ఇంతకీ ఏమయ్యిందింటే.. అన్ స్టాపబుల్ షో సీజన్ 4 నడుస్తోంది. రీసెంట్ గా ఈ షోకు గెస్ట్ గా అల్లుఅర్జున్ వచ్చాడు. దానికి సబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు టీమ్. అయితే ఈ షోకు బన్నీ వస్తే.. పవన్ కళ్యాణ్ కు సబంధించిన  వివాదం విషయంలో క్లారిటీ ఇచ్చి. ఇక గొడవకు పుల్ స్టాప్ పెడతాడేమ్ అనుకున్నారు. కాని ప్రోమోను చూస్తే.. అసలు ఆ ఊసే లేకుండా షో నడిచినట్టు తెలుస్తోంది. 

ఈ విషయంలో క్లారిటీ ఇచ్చి ఉంటే.. బన్నీ బలం పెరిగి సినిమాకు  కూడా అది ఉపయోగపడేది. అయితే అల్లుఅర్జున్ ఈషోలో నేషనల్అవార్డ్ గురించి మాట్లాడుతూ చేసినవాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.  నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అని అన్ స్టాపబుల్ షో లో బాలయ్య ప్రశ్నించగా..  అల్లు అర్జున్ సమాధానం చెప్తూ ‘మన తెలుగు వాళ్లకు నేషనల్ అవార్డు రాలేదని నాకు చాలా బాధగా ఉండేది. దీనిని ఎలా అయినా కొట్టాలని రౌండ్ మార్క్ చేసుకొని కొట్టాను అని అన్నారు. 
 

దాంతో మన తెలుగు వారికి రాలేదు అని గుచ్చి చెప్పారంటూ నెగెటీవ్ గా మాటలు తీసుకుని ప్రచారం చేస్తున్నారు కొంతమంది. అంతే కాదు గతంలో బన్నీ అన్న మాటలు కూడా వైరల్ చేస్తున్నారు. ఆయన గతంలో ఏమన్నారంటే.. ఇంతకు ముందు మనోళ్లకు నేషనల్ అవార్డ్ వచ్చింది అనుకున్నాను. నేను మూడోవాడినో...నాలుగో వాడినో అనుకున్నా.. కాని అవార్డ్ అనౌన్స్ అవ్వగనే తెలిసింది. న్యూస్ లో చూస్తే.. ఫస్ట్ హీరో అని వస్తోంది. 
 

Allu Arjun, #Pushpa2, sukumar

సో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది. అందుకే ఇటువంటివి కదిలించకుండా చాలా జాగ్రత్తగా పుష్ప2 రిలీజ్ వరకూ కేర్ ఫుల్ గా ఉండు సామి అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇక సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన పుష్ప2 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇప్పటికే 12 వందల కోట్లు బిజినెస్ కనిపిస్తుందట. సో కలెక్షన్లు 2 వేల కోట్లు దాటినా ఆశ్చర్య పోవలసరం లేదు. సో ఏం జరుగుతుందో చూడాలి. 

Allu Arjun, Keshava, Pushpa,

దాంతో ఇంత వరకూ మనకు బెస్ట్ హీరో రాలేదాఅని ఆశ్చర్యం వేసింది అన్నారు. ఇక ఇప్పుడేమో మనకు రాలేదు అనే కసితోనే ఎలాగైన సాధించాలని పట్టుదలతో  సాధించి చూపించాను అన్నారు. దాంతో బన్నీ రెండు మాటలు మాట్లాడాడు..మాటలు మారుస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. నేనేదో ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరికంటే గొప్పవాడిని అని చెప్పడం లేదు. ఎంతోమంది అద్భుతమైన నటులు ఉన్నారు, కానీ ఎందుకో దురదృష్టం కొద్దీ వాళ్లకు నేషనల్ అవార్డు రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. 

Latest Videos

click me!