గంగువ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషలతో సహా 10కి పైగా భాషల్లో విడుదకానుంది. ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో నటుడు సూర్య ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. తమిళనాడు మాత్రమే కాదు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి వివిధ రాష్ట్రాల్లో సూర్య నాన్‌స్టాప్‌గా ప్రమోట్ చేస్తున్నాడు.
అయితే, రిలీజ్ కి మూడు రోజుల ముందు కంగువా కొత్త చిక్కులో పడింది. 75-25 షేరింగ్ కి థియేటర్ యజమానులు ఒప్పుకోలేదు. దీంతో టికెట్ల అమ్మకాలు ఆగిపోయాయి. ఈ సమస్య బుధవారం వరకూ ఉంటుందనీ, వసూళ్లపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. శివకార్తికేయన్ అమరన్ సినిమా బాగా ఆడుతుండటంతో కంగువాకి థియేటర్లు దొరుకుతాయా అనేది సందేహమే. సూర్య కంగువాకు థియేటర్ కష్టాలు రావడంతో అనుకున్న టైమ్ సినిమా రిలీజ్ అవుతుందా? అనే చర్చ మొదలైంది.