చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఊహించని క్రేజ్ తెచ్చుకున్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ కర్ణాటకలో కన్నడ చిత్రాల్లో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. కానీ అత్యంత పిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో మృతి చేసిన సంగతి తెలిసిందే. 2021లో పునీత్ రాజ్ కుమార్ మరణించారు. పునీత్ కి టాలీవుడ్ రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో మంచి అనుబంధం ఉంది.