ఆ హీరో అర్దరాత్రి తలుపు కొట్టి అసభ్యంగా ప్రవర్తించాడు.. హీరోయిన్ మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు.

First Published | Oct 5, 2024, 4:29 PM IST

భాష ఏదైనా.. ఫిల్మ్ ఇండస్ట్రీలో తారలు ఏదో ఒక రకంగా.. వేదింపులు ఎదురుకున్నవారు ఉన్నారు. అలాంటివారి లిస్ట్ లో బాలీవుడ్ తార మల్లిక షెరావత్ కూడా చేరింది. 

బాలీవుడ్ టాలీవుడ్ అని లేదు.. అన్ని చోట్ల మహిళా తారలపై వేధింపులు తప్పడంలేదు. మీటు ఉద్యమాలు.. సోషల్ మీడియా వార్ లు ఇప్పుడు పెరిగాయి కాని..అప్పట్లో పెద్దగా వీటిపై పట్టింపులు ఉండేవి కాదు. కాని ఇప్పుడు ఈ విషయంలో ఉద్యమాలు లేవడంతో.. అన్ని భాషల్లలో.. ఇలా వేధింపులు ఎదుర్కొంటున్న తారలు బయటకు వస్తున్నారు. 
 

ఈమధ్య వరకూకేరళాలో జరిగిన రచ్చ అందరికి తెలిసిందే. అక్కడ నటీమణులపై లైంగిక వేదింపులు సంచలనంగా మారడంతో.. మోహాన్ లాల్ వంటి స్టార్స్ కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇక బాలీవుడ్ లో ఇలాంటివ వేదింపులు ఎక్కువగా ఉన్నా.. ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు.దాంతో ఇప్పటి వరకూ బాలీవుడ్ లో కంగనా రనౌత్, తాప్సీ లాంటివారు ఈ విషయంలో వాయిస్ రేజ్ చేస్తూ వస్తున్నారు.

దాంతో చాలామంది తమకు జరిగిన అన్యాయాలను బయటకు చెప్పుకుంటున్నారు. ఇక తాజాగా ఈ విషయంలో తన వాయిస్ వినిపించారు బాలీవుడ్ నటి మల్లికా షరావత్.


ప్రముఖ నటి మల్లికా షెరావత్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.  తన తాజా చిత్రం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో'ని ప్రమోట్ చేస్తోంది. ఈ సమయంలో.. ఆమె తనకు జరిగిన ఓ చేదు .. భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఇది అందరినీ షాక్ కు గురి చేసింది. ఒకప్పుడు తాను ఒక  మల్టీ స్టారర్‌ ప్రాజెక్ట్‌ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఓ ప్రముఖ నటుడు తనను చాలా వేధించేవాడని మల్లికా షెరావత్‌ చెప్పింది.

ఈ ఘటన వల్ల తాను చాలా భయపడ్డానని. చాలా రోజులు కోలుకోలేకపోయానని అన్నారు. ఈ విషయంలో ఏం చేయాలో కూడా తనకు అర్ధం కాలేదు అన్నారు మల్లిక. 

Mallika Sherawat

మల్లికా షెరావత్ మాట్లాడుతూ.. ఆ టైమ్ లో  నేను దుబాయ్‌లో ఓ పెద్ద సినిమా షూటింగ్‌లో ఉన్నాను.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆడియన్స్ కు బాగా నచ్చింది. అందరు  ఇష్టపడి సూపర్‌హిట్‌ చేశారు.

ఆ చిత్రంలో మల్టీస్టారర్‌ హీరోలు నటించారు. అందులో నాది కామెడీ పాత్ర. అప్పుడు జరిగింది ఈ విషయం అంటూ వెల్లడించారు.  ఆ సినిమాలో నాతో నటించిన హీరో ఒకరు నన్ను వేదించారు.

మేము ఉంటున్న హోటల్ లో రోజు అతను రాత్రి 12 గంటలకు నా గది తలుపు తట్టేవాడు. తలుపు తీయ్యకపోతే డోర్ పగలగొట్టి నా బెడ్ రూంలోకి వస్తానంటూ బెదిరించేవాడు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి అన్నారు. 

Mallika Sherawat

ఈ సంఘటన  నన్ను చాలా భయపెట్టింది. నువ్వు ఎన్ని ప్రనయత్నాలు చేసినా.. నేను తలుపు తీయ్యను. నువ్వు అనుకున్నది జరగదు అంటూ ఆ హీరోకి నేను వార్నింగ్ ఇచ్చాను అని అన్నారు మల్లికా షరావత్.

ఇక అప్పటి నుంచి అతనితో కలిసి తాను పనిచేయలేదని ఆమె అన్నారు. ఆహీరో కూడా తన సినిమాలో నాకు అవకాశం ఇవ్వలేదు అన్నారు మల్లిక. 2002లో వచ్చిన 'జీనా సిర్ఫ్ మేరే లియే' సినిమాతో మల్లికా షెరావత్ తన కెరీర్‌ను ప్రారంభించింది.

అయితే 2004లో వచ్చిన ‘మర్డర్‌’ సినిమాతోనే అతనికి నిజమైన గుర్తింపు వచ్చింది. దీని తర్వాత మల్లిక 'ఖ్వాహిష్', 'ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్', 'వెల్ కమ్', 'డబుల్ ధమాల్' మొదలైన అనేక చిత్రాలలో నటించింది. 
 

ఇప్పుడు మల్లికా షెరావత్ రాజ్‌కుమార్ రావ్, తృప్తి దిమ్రీ నటించిన 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' చిత్రంతో 7 సంవత్సరాల తర్వాత బాలీవుడ్‌లోర రీ ఎంట్రీ ఇస్తోంది మల్లిక. ఈ మూవీ కామెడీ బేస్ గా తెరకెక్కుతోంది. అంతే కాదు ఈసినిమా అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

Latest Videos

click me!