టార్గెట్ 1000 కోట్లు.. విజయ్ దళపతి 69 సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా..?

First Published | Oct 5, 2024, 5:00 PM IST

చివరి సినిమాతో రికార్డ్స్ ను బ్రేక్  చేయాలని చూస్తున్నాడట దళపతి విజయ్. రాజకీయాల్లోయాక్టీవ్ అవుతున్న ఆయన చివరి సినిమాను రీసెంట్ గా స్టార్ట్ చేశారు. 

రాజకీయాల్లో యాక్టివ్‌గా కాబోతున్నాడు తమిళ స్టార్ హీరో  విజయ్ దళపతి.  సినిమాలకు శాస్వతంగా  విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. దళపతి 69 అతని కెరీర్‌లో చివరి సినిమా కాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ రాజకీయ రంగ ప్రవేశం.. అతని చివరి సినిమాపై అటు  అభిమానుల్లో, ఇటు  సినీ పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది. 
 

దళపతి 69 తమిళ సినిమాతో రికార్డ్స్ ను బ్రేక్ చేసి.. జీవితాంత గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆయన కెరీర్ లో ఇంత వరకూ 1000 కోట్లు సాధించిన సినిమాలేదు.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ముఖ్యంగా తెలుగు స్టార్ హీరోల సినిమాలు 1000 కోట్లు టార్గెట్ గా దూసుకుపోతుండగా.. తనచివరి సినిమాతో ఆ రికార్డ్ ను క్రాస్ చేయాలని దళపతి భావిస్తున్నాడట. 


ఇండియాన్ ఫిల్మ్ హిస్టరీలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 సినిమా అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ఇక తమిళంలో కూడా బాహుబలి విడుదలై 1000 కోట్ల రూపాయల మార్కును దాటేసింది. కానీ ఇంత వరకూ కంప్లీట్  తమిళ చిత్రం ఇటువంటి  రికార్డ్ ను సాధించలేదు. 

దాంతో తన సిపిమాతో ఈ మైలురాయిని దాటి  అభిమానులు సంతోషపరచాలని ఆయన  ఆశిస్తున్నారు. విజయ్ నటించిన బిగ్గెస్ట్ హిట్ చిత్రం లియో ప్రపంచవ్యాప్తంగా 620 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్లకు చాలా దగ్గరగా వచ్చింది. దాంతో తన చివరి సినిమాను ఇంకాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ రికార్డ్ పెద్ద కష్టమేమి కాదు అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఈసినిమాకు హెచ్ వినోద్ దర్శకుడు. మరి ఆయన  దళపతి 69 వ సినిమాతో 1000 కోట్ల ఫిగర్ ని క్రాస్ చేసి విజయ్ కి మరో బిగ్ సక్సెస్ ని అందించగలడా అనేది చూడాలి. దర్శకుడు హెచ్.వినోద్ ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్‌ని కలుపుతాడని అంతా అనుకున్నారు. ఈ సినిమాలోని స్టార్ కాస్ట్‌ని పరిగణనలోకి తీసుకుంటే ప్రేక్షకుల్లో కూడా అదే అంచనాలు ఉన్నాయి. 

అయితే దళపతి 69 పొలిటికల్ సినిమా అవుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పొలిటికల్ సినిమా అయ్యి ఉంటే.. తన రాజకీయ జీవితానికి కూడా అది ప్లాస్ అవుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.

తాజాగా ఓపెనింగ్ చేసుకుంది ఈసినిమా. ఈమూవీలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ విషయం కూడా అభిమానులను కలవరపెడుతోంది. ఎందుకంటే పూజాకు ఐరన్ లెగ్ అని పేరు ఉంది.

ఆల్ రడీ బీస్ట్ సినిమాలో విజయ్ తో నటించగా.. ఈసినిమా ప్లాప్ అయ్యింది. దాంతో తన చివరి సినిమాకోసం విజయ్ ఇలా ప్రయోగం చేయడం కరెక్ట్ కాదు అని ఫ్యాన్స్ అభిప్రాయం. 

Thalapathy Vijay

దళపతి 69 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. ప్రస్తుతం భారీ సెట్‌లో ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దళపతి 69కి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.

మలయాళ తారలు మమిత, నరేష్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, మోనిషా బ్లాసీ, ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Latest Videos

click me!